Asianet News TeluguAsianet News Telugu

ఇక బాహుబలిని అందుకోవడం ఎవరి తరం కాదు..లెక్కలివిగో..

  • 50 రోజులు పూర్తయినా ఆగని బాహుబలి కలెక్షన్స్ ప్రభంజనం
  • 1000కిపైగా థియేటర్లలో కొనసాగుతున్న బాహుబలి హవా
  • చైనా రిలీజ్ తర్వాత దంగల్ కు షాకిచ్చేందుకు రెెడీ అవుతున్న బాహుబలి
bahubali collections record still continues after 50 days run

భారతీయ చలన చిత్ర పరిశ్రమల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రికార్డుల మోత మ్రోగిస్తూ బాక్సాఫీసు రేసులో దూసుకెళ్లిన రాజమౌళి దృశ్య కావ్యం బాహుబలి-2 విజయవంతంగా 50 రోజులను పూర్తి చేసుకుని ఇంకా తన పరంపర కొనసాగిస్తోంది. కనీవినీ ఎరుగని రీతిలో బాక్సాఫీసు వద్ద ప్రభంజనం సృష్టించిన ఈ చిత్రం ఎవరూ అందుకోలేని శిఖరాలను అందుకుని యావత్ భారతదేశ ప్రేక్షకులను ఆశ్చర్య పరిచింది.

 

బాహుబలి-2 రిలీజ్ ముందు వరకు ఓ భారతీయ సినిమా సాధించిన అత్యధిక బాక్సాఫీసు స్కోర్ రూ. 700 కోట్లు(పికె) పైచిలుకు మాత్రమే. అయితే ఆ రికార్డును చెరిపేయడంతో పాటు రూ. 1000 కోట్లు, రూ. 1500 కోట్ల మార్కును అందుకున్న తొలి ఇండియన్ మూవీగా బాహుబలి2 చరిత్ర సృష్టించింది.

 

తెలుగులో విడుదలైన తొలి రోజే రూ. 121 కోట్లు వసూలు చేసిన రికార్డు క్రియేట్ చేసిన బాహుబలి-2 చిత్రం ఇప్పటి వరకు వరల్డ్ వైడ్ రూ. 1676 కోట్లు వసూలు చేసింది. తెలుగులో సమీప కాలంలో ఎవరూ అందుకోలేనంత ఎత్తుకు చేరుకుంది బాహుబలి. ఈ చిత్రం ఏపీ, తెలంగాణాల్లో కలిపి దాదాపు రూ. 300 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. షేర్ విషయానికొస్తే... లాస్ట్ వీకెండ్ నాటికి ఈ చిత్రం 196 కోట్లను టచ్ అయింది. ఇంకా పలు చోట్ల సినిమా విజయవంతంగా ప్రదర్శితం అవుతున్న నేపథ్యంలో 200 కోట్ల షేర్ మార్కును అందుకునే అవకాశం ఉందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.

 

ఇక హిందీలో బాహుబలి-2 మూవీ రూ. 500 కట్లు వసూలు చేసి.... ఈ మార్కును అందుకున్న తొలి హిందీ చిత్రంగా చరిత్ర సృష్టించింది. అమీర్ ఖాన్ ‘దంగల్' మూవీ చైనా రిలీజ్ తర్వాత బాహుబలి-2 వసూలు చేసిన రూ. 1500 కోట్ల మార్కును దాటేసి రూ. 2000 కోట్లను అందుకున్న సంగతి తెలిసిందే. అయితే జులైలో బాహుబలి-2 చిత్రాన్ని చైనాలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. చైనా రిలీజ్ తర్వాత బాహుబలి-2 చిత్రం ‘దంగల్' రికార్డును బద్దలు కొట్టే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. సాహోరే బాహుబలి.

Follow Us:
Download App:
  • android
  • ios