Asianet News TeluguAsianet News Telugu

బాహుబలీ.. అవి బెనిఫిట్ షోలు కాదు.. అదనపు షోలు.. ప్రత్యేకమైనవి

  • బెనిఫిట్ షోలు వేస్తే ఊరుకోబోమంటున్న తెలంగాణ సర్కారు
  • అవి బెనిఫిట్ షోలు కాదు.. కేవలం ప్రత్యేకమైన అదనపు షోలు అంటున్న ఎగ్జిబిటర్లు
  • గురువారం రిలీజ్ అవుతుందో కాదోనని టెన్షన్ పడుతున్న టికెట్ కొన్న ప్రేక్షకులు
  • మీడియా హడావుడితో టెన్షన్ పడొద్దంటున్న ఎగ్జిబిటర్లు

 

bahubali additional benefit shows will run tells exhibitors

'బాహుబలి-2' ఫీవర్ ను క్యాష్ చేసుకునేందుకు ప్లాన్ చేసిన బెనిఫిట్ షోలపై తెలంగాణ సర్కార్ సీరియస్ గా ఉంది. బాహుబలి2కు సంబంధించి ఎలాంటి బెనిఫిట్ షోలు వేయకూడదని సర్కార్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా బేఖాతరు చేయడంపై సినిమాటోగ్రపీ మంత్రి మంత్రి తలసాని శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేసారు. హద్దు మీరితే కఠిన చర్యలు తప్పవని స్పష్టంచేశారు.

 

ప్రభుత్వం వైఖరి ఇలా ఉంటే మరొవైపు హైదరాబాద్ లో కొన్ని చోట్ల థియేటర్స్ యాజమాన్యాలు ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేస్తూ బెనిఫిట్ షోల టికెట్స్ అమ్మారు. చాలా చోట్ల ఇప్పటికే టికెట్స్ అమ్ముడయ్యాయి. ఇవాళ(గురువారం) రాత్రి 9గంటల నుంచి పలు థియేటర్స్ లో బెనిఫిట్ షోలు వేసేందుకు రంగం సిద్ధం చేసారు.

 

బాహుబలి-2 మానియాను క్యాష్ చేసుకోవడానికి థియేటర్ల యాజమాన్యాలు నిబంధనలకు విరుద్ధంగా వ్యవమరించడంపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సీరియస్ అయ్యారు. “బెనిఫిట్ షోలకు అసలు పర్మిషన్ ఇవ్వ లేదని, ఏప్రిల్ 28 నుండి ఐదు షోలకు మాత్రమే పర్మిషన్ ఇచ్చామని, ఇష్టానుసారంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

బెనిఫిట్ షోల పేరుతో ఎవరు ఎవరికి బెనిఫిట్ చేస్తున్నారో అర్థం కావడం లేదని, వీటిపై చాలా సీరియస్ గా ఉంటామని మంత్రి తలసాని అన్నారు. ఆ తర్వాత జరిగే పరిణామాలు, ప్రభుత్వం తీసుకునే చర్యలకు థియేటర్ యాజమాన్యాలే బాధ్యత వహించాల్సి వస్తుందన్నారు మంత్రి తలసాని.

 

తెలంగాణ ప్రభుత్వం బాహుబలి-2 లాంటి గొప్ప సినిమాను ప్రమోట్ చేస్తుందని, అందుకే ఐదు షోలకు అనుమతి ఇచ్చిందని... గవర్నమెంట్ ఏ రేట్లు అయితే ఫిక్స్ చేసిందో అదే రేట్లకు టికెట్స్ అమ్మాలని, డిమాండ్ ఎక్కువగా ఉందని ఎక్కువ రేట్లకు టికెట్లు అమ్ముతూ ప్రేక్షకులను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

 

 అయితే ఇప్పటికే బెనిఫిట్ షోల టికెట్స్ విక్రయించిన ఎగ్జిబిటర్లు 5వ షోకు ప్రభుత్వం అనుమతించినందున ఆ షోలకు ఎలాంటి అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదని అంటున్నారు. కొన్ని మీడియా సంస్థలు చెప్తున్నట్లుగా..  టెకెట్లు కొన్నవారు అయోమయంలో పడొద్దని అంటున్నారు.

ఇలా రెండు రకాల వాదనలతో టికెట్లు కొన్నవారిలో టెన్షన్ ఓ వైపు భయపెడుతోంది. అసలు షో మొదలయ్యే వరకు ఇవాళ సినిమా ప్రదర్శన ఉంటుందో? లేదో అనే పరిస్థితి నెలకొన్నా... ఇవి ప్రత్యేక షోలే తప్ప బెనిఫిట్ షోలు కాదని ఎగ్జిబిటర్లు వాదిస్తున్నారు. సో ఇవాళ షోలు ఉన్నాయో లేదో అర్థం చేసుకోవచ్చు. ఆందోళన పడొద్దు. జై మాహిష్మతి.

Follow Us:
Download App:
  • android
  • ios