సినిమా జీవితం అంటేనే గాసిప్స్ వస్తంటాయి. ఇది ఇప్పటి తంతు కాదు ఎప్పటినుండో గాసిప్స్ అనేది స్టర్స్ పై వస్తుంటాయి. ఎన్నికష్టాలు ఉన్నా నటిగా రాణించాలంటే నిరంతరం ముఖంపై చిరునవ్వు చెరిగిపోకూడదు, ఈ వృత్తి కోసం తాము ఎన్నో త్యాగాలు చేసాం కబట్టే ఈ స్థాయిలో ఉన్నాం అని వాపోయింది మిల్కీ బ్యూటీ తమన్నా. అయితే సెలబ్రిటీల గురించి కొన్ని రూమర్స్ ఏ ఆధారం లేకుండా పుట్టుకురావడం.. వాటిని తమ వ్యక్తిగత జీవితాలకు ఆపాదించడంపై తమన్నా ఫైర్ అయ్యారు.

తమన్నా-ప్రభుదేవ మధ్య ఎఫైర్ నడుస్తోందట.. తమన్నా కొత్త సినిమాలో లిప్ల లాక్ ఉందట.. దానికి ప్రత్యేకించి రేట్ కూడా ఫిక్స్ చేసిందట.., ఇలా గత కొంతకాలంగా మిల్కీబ్యూటీ తమన్నాపై లేనిపోని రూమర్స్ పుట్టుకొస్తూనే ఉన్నాయి. అయితే వీటిని గతంలో బహిరంగంగానే ఖండించింది తమన్నా. తాజాగా నా గురించి మీడియాలో ఏ వార్త వచ్చినా దయచేసి నన్ను సంప్రదించి క్లారిటీ తీసుకున్న తరువాతే వార్తలను ప్రసారం చేయమంటూ మీడియాను వేడుకుంది తమన్నా. టీఆర్ఫీ రేటింగ్స్ కోసం వార్తల్ని వక్రీకరించవద్దని, లేనిపోని వాటిని ఏ ఆధారం లేకుండా ఇష్టం వచ్చినట్లు రాసేస్తారా అంటూ ప్రశ్నించింది. కొన్నిసార్లు మీడియాలో వచ్చే వార్తలను చూస్తే విచిత్రంగా అనిపిస్తుందని, తన ప్రమేయం లేకుండానే తనే అన్నట్లుగా గతంలో చాలా వార్తలను ప్రసారం చేశారన్నారు. మీడియా ఈ విషయంలో భాద్యతగా వ్యవహరించాలని కోరారు తమన్నా. ఇదిలాఉంటే ప్రస్తుతం తమన్నా ‘క్వీన్’ తెలుగు రీమేక్లో టైటిల్ పోషిస్తుంది. ఈ చిత్రం షూటింగ్ దశలో ఉండగా.. కళ్యాణ్ రామ్ సరసన ‘నా నువ్వే’ చిత్రంలో నటించింది. ఈ మూవీ మే 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.