Asianet News TeluguAsianet News Telugu

బ్రాండ్ న్యూ టెక్నాలజీతో తెరకెక్కుతున్న బాహుబలి2

  • బాహుబలి మూవీకి రోజురోజుకు పెరుగుతున్న క్రేజ్
  • మూవీని సరికొత్త 5డీ మోషన్ టెక్నాలజీతో తెరకెక్కిస్తున్న రాజమౌళి
  • ప్రపంచ సినిమాలో కొత్త టెక్నాలజీకి బాహుబలితో నాంది
bahubali 2 motion technology 5d

 

 

బాహుబలి 2 సినిమా.. బాహుబలి ది కన్క్లూజన్ పబ్లిసిటీ సందడి జోరుగా సాగుతోంది. అక్టోబర్ మొదటి వారంలోనే లోగో రిలీజ్ చేశారు. ఇక ఈ మూవీ ఫస్ట్ లుక్ కూడా ప్రభాస్ పుట్టిన రోజున అక్టోబర్ 23న రిలీజ్ చేస్తామని ప్రకటించారు. లోగోను ప్రెస్ మీట్ పెట్టి రిలీజ్ చేశారు కానీ ఫస్ట్ లుక్ రిలీజ్ కోసం ఏర్పాట్లు మాత్రం భారీగా జరుగుతున్నాయి.

bahubali 2 motion technology 5d

 

బాహుబలి ఫస్ట్ లుక్ ను బాలీవుడ్ అడ్డా ముంబయిలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ముంబయి ఫిలిం ఫెస్టివల్ వేదికగా బాహుబలి2 ప్రచారం జోరందుకోవాలని మూవీ టీం ప్లాన్ చేస్తున్నారు. హిందీలో బాహుబలి సమర్పకుడు కరణ్ జోహార్ సహా పలువురు ప్రముఖుల సమక్షంలో ఈ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ప్రభాస్, రానా, రాజమౌళి సహా ముఖ్యమైన టీమ్ మెంబర్స్ అంతా ఈ వేడుకలలో పాల్గొంటారు. బాహుబలి 2 మేకింగ్ వీడియోల్లో కొన్ని వర్చువల్ రియాలిటీ వీడియో క్లిప్స్ కూడా ఈ సందర్భంగా రిలీజ్ చేయనున్నారు.

bahubali 2 motion technology 5d

ఇక బాహుబలి 2 షూటింగ్ ప్రస్థుతం దాదాపు పూర్తి కావచ్చింది. మరి కొన్ని రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకోనున్న ఈ మూవీని హాలీవుడ్ రేంజిలో తెరకెక్కిస్తున్నారు రాజమౌళి. గతంలో హాలీవుడ్ మూవీల్లో సైతం ఇప్పటివరకు ఉపయోగించని మోషన్ టెక్నాలజీని రాజమౌళి ఈ సినిమా కోసం వినియోగిస్తున్నారు. ఈ మోషన్ టెక్నాలజీతో సినిమా చూసే ప్రేక్షకులను బాహుబలి అనే కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లాలన్నదే తన కోరిక అని రాజమౌళి ఇప్పటికే ప్రకటించారు.

Follow Us:
Download App:
  • android
  • ios