తెలుగు సినిమా కీర్తి పతాకను ప్రపంచం నలుమూలలా ఎగరేసిన రాజమౌళి దృశ్యకావ్యం బాహుబలి. ఈ చిత్రం రిలీజ్ కు కౌంట్ దగ్గర పడింది. ఇంకా పట్టుమని నెల రోజులు కూడా లేదు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించిన చిత్ర యూనిట్ అదే తరహాలో ప్రమోషన్ నిర్వహిస్తోంది.

బాహుబలి చిత్రానికి ప్రమోషన్ ఏ రేంజ్ లో ఎలా చేయాలో అలా చేశామని, బాహుబలి రిలీజ్ కు ముందు ఇంతస పెద్ద సక్సెస్ అవుతుందని తమకే తెలియలేదని ప్రమోటర్ మహేష్ కోనేరు అంటున్నారు. గతంలో తమ సినిమాతో అసోసియేట్ అవ్వాలని ఎన్నో ప్రముఖ బ్రాండ్స్ కంపెనీల చుట్టూ తిరిగామని, అయితే.. ఇప్పుడు అవే కంపెనీలు తమతో కలిసి పనిచేసేందుకు ఆసక్తి చూపడం పెద్ద ఎచీవ్ మెంట్ అని ఆయన అన్నారు.

ఇక రానా దగ్గుబాటి ఈ చిత్రంలో భల్లాల దేవుడిగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రమోషన్ లో దూసుకెళ్తున్న బాహుబలి ట్రైలర్ రికార్డులు కూడా మరే చిత్రం అందుకోలేనంత స్థాయికి చేరుకుంది. ఇక రానా సరికొత్త లుక్ ను రిలీజ్ చేసింది టీమ్. ఈ లుక్ కు సంబంధించిన పోస్టర్ ను ... బాలీవుడ్ ప్రముఖ దర్శక నిర్మాత కరణ్ జోహార్ తన ట్విట్టర్ లోనూ ప్రమోట్ చేస్తున్నారు.

మొత్తానికి దేశవ్యాప్తంగానే కాక ప్రపంచవ్యాప్తంగా ఫుల్ క్రేజ్ సంపాదించిన బాహుబలి ఏప్రిల్ 28 న రిలీజ్ కావాల్స్ ఉండటంతో... ప్రమోషన్ మాత్రం ఒక రేంజ్ లో దానంతటదే జరుగుతోందా అన్న రేంజ్ లో ప్రమోట్ చేస్తున్నారు.