Asianet News TeluguAsianet News Telugu

అక్కడ 150 తెస్తే చాలు.. బాహుబలి దే చరిత్ర

  • ప్రపంచవ్యాప్తంగా తెలుగువారిని తలెత్తుకునేలా చేసింది ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి
  • కలెక్షన్ల పరంగా బాక్సాఫీస్ ను బాహుబలి2 షేక్ చేసినప్పటికీ ఆమీర్ ఖాన్ ‘దంగల్’ సినిమా కంటే వెనుకే వుంది​
Bahubali 2 all set to release in china

ప్రపంచవ్యాప్తంగా తెలుగువారిని తలెత్తుకునేలా చేసింది ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి. కలెక్షన్ల పరంగా బాక్సాఫీస్ ను బాహుబలి2 షేక్ చేసినప్పటికీ ఆమీర్ ఖాన్ ‘దంగల్’ సినిమా కంటే వెనుకే వుంది. ‘ఆల్ టైమ్ హయ్యెస్ట్ గ్రాసింగ్ ఇండియన్ ఫిల్మ్ రికార్డ్ ‘దంగల్’ దే. ఈ సినిమా రూ. 1864 కోట్లు వసూలు చేసింది, ఒక చైనాలోనే రూ. 1200 కోట్లు రాబట్టింది. దీంతో బాహుబలి2 రెండో స్థానంతో సరిపెట్టుకోక తప్పలేదు.

అయితే ఇప్పుడు బాహుబలి2 చైనా లో రిలీజ్ అయ్యేందుకు లైన్ క్లియర్ అయింది. ‘బాహుబలి2’ సినిమా వరల్డ్ వైడ్ గా బాక్సాఫీసు వద్ద రూ. 1713 కోట్లు వసూలు చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా చైనా లో కేవలం రూ. 150 కోట్లు దాటితే చాలు.. దంగల్ రికార్డు బ్రేక్ చేసినట్లే. బాహుబలి2 వసూళ్లు బావుంటే రూ. 2000 కోట్ల మార్కును అందుకునే అవకాశం కూడా ఉంది. అదే జరిగితే రూ. 2వేల కోట్ల మార్కును అందుకున్న తొలి ఇండియన్ ఫిల్మ్ గా ‘బాహుబలి2’ ప్రపంచ చలనచిత్ర రంగంలో ఒక అధ్యాయానికి తెరతీసినట్టే.

Follow Us:
Download App:
  • android
  • ios