Asianet News TeluguAsianet News Telugu

Bangarraju Trailer: పర్ఫెక్ట్ సంక్రాంతి ఎంటర్టైనర్... నాగ్-చైతూ చంపేశారంతే!

వారం రోజులుగా బంగార్రాజు ప్రమోషన్స్ జోరుగా నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా నేడు ట్రైలర్ విడుదల చేశారు. పక్కా విలేజ్ సోసియో ఫాంటసీ డ్రామాగా బంగార్రాజు(Bangarraju) తెరకెక్కినట్లు ట్రైలర్ ద్వారా అర్థమవుతుంది.

bagarraju trailer out now promises a perfect sankranthi 2022 family entertainer
Author
Hyderabad, First Published Jan 11, 2022, 6:33 PM IST

2022 లో సంక్రాంతి (Sankranthi 2022) బరిలో దిగుతున్న పెద్ద చిత్రం బంగార్రాజు. నాగార్జున-నాగ చైతన్యల మల్టీస్టారర్ గా తెరకెక్కింది. ఆర్ ఆర్ ఆర్, రాధే శ్యామ్, భీమ్లా నాయక్ విడుదల వాయిదా నేపథ్యంలో నాగార్జున బంగార్రాజు ని సంక్రాంతికి సిద్ధం చేశారు. 2016లో విడుదలైన సోగ్గాడే చిన్నినాయనా చిత్రానికి ఇది సీక్వెల్. సోగ్గాడే చిన్నినాయనా సూపర్ హిట్ అందుకోగా బంగార్రాజు మూవీపై పాజిటివ్ బజ్ ఏర్పడింది. 

గత వారం రోజులుగా బంగార్రాజు ప్రమోషన్స్ జోరుగా నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా నేడు ట్రైలర్ విడుదల చేశారు. పక్కా విలేజ్ సోసియో ఫాంటసీ డ్రామాగా బంగార్రాజు(Bangarraju) తెరకెక్కినట్లు ట్రైలర్ ద్వారా అర్థమవుతుంది. యాక్షన్, రొమాన్స్, కామెడీ, ఫిక్షన్ జోడించి ఓ పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా బంగార్రాజు రానుంది. పల్లెటూరి ప్లే బాయ్ గా నాగ చైతన్య (Naga Chaitanya)లుక్, క్యారెక్టర్ ఆసక్తి రేపుతున్నాయి. గోదావరి యాసలో చైతూ డైలాగ్స్, అమ్మాయిలతో రొమాన్స్ అదిరిపొనున్దినిపిస్తుంది. 

ఇక వరుస విజయాలతో దూసుకుపోతున్న కృతి శెట్టి రోల్ ఆసక్తి రేపుతోంది. ఊరిమీద అజిమాయిషీ చెలాయించే నాగమణి పాత్రలో అదరగొడుతుంది. ఇక నాగ చైతన్య, కృతి రోల్స్ టామ్ అండ్ జెర్రీ తరహాలో సాగే సూచనలు కలవు. ఇక నాగార్జున (Nagaraju) బంగార్రాజుగా ఆత్మ రూపంలో చేసే మాయలు, రమ్యకృష్ణ తో మోటు సరసం సినిమాకు ఎక్స్ట్రా డోస్. నాగబాబు, రావు రమేష్, వెన్నెల కిషోర్ వంటి స్టార్ క్యాస్ట్ బంగార్రాజు ట్రైలర్ కి ఆకర్షణగా నిలిచారు. చెప్పుకోదగ్గ చిత్రాలు బరిలో లేని నేపథ్యంలో బంగార్రాజు రికార్డు వసూళ్లు అందుకోవడం ఖాయం. 

మొత్తంగా నాగార్జున ఫ్యాన్స్, సంక్రాంతి సినిమా ప్రియుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా సినిమా ఉంటుందని ట్రైలర్ నమ్మకం కలిగించింది. సోగ్గాడే చిన్ని నాయనా చిత్రానికి దర్శకత్వం వహించిన కళ్యాణ్ కృష్ణ బంగార్రాజు చిత్రాన్ని తెరకెక్కించారు. కాగా అన్నపూర్ణ స్టూడియోస్, జీ స్టూడియోస్ బంగార్రాజు చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించాయి. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. జనవరి 14న ప్రపంచవ్యాప్తంగా బంగార్రాజు విడుదల కానుంది.

ఇక నాగ చైతన్య గత చిత్రాలు మజిలీ, లవ్ స్టోరీ విజయం సాధించాయి. దీంతో బంగార్రాజు ప్రీ రిలీజ్ బిజినెస్ దాదాపు రూ. 40 కోట్ల వరకూ జరిగింది. సంక్రాంతి సీజన్ నేపథ్యంలో బంగార్రాజు బయ్యర్లకు ఖచ్చితంగా లాభాలు పంచుతుందని నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios