విజయ్ దేవరకొండ సినిమాలు నచ్చలేదు... పీవీ సింధు కామెంట్స్ వైరల్
బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధుకు విజయ్ దేవరకొండ నటించిన చిత్రాలు నచ్చలేదట. ఈ మేరకు ఆమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
తెలుగు అమ్మాయి పీవీ సింధు బ్యాడ్మింటన్ లో తిరుగులేని క్రీడాకారిణి. అంతర్జాతీయ వేదికలపై ఆమె అద్భుత విజయాలు అందుకున్నారు. ప్రతిష్టాత్మక మెడల్స్ సాధించారు. కాగా పీవీ సింధు తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ఒత్తిడిని అధిగమించేందుకు సినిమాలు చూస్తానని పీవీ సింధు అన్నారు. ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్ యాక్టింగ్ అంటే పీవీ సింధుకు చాలా ఇష్టం అట. అయితే విజయ్ దేవరకొండ నటించిన కొన్ని చిత్రాలు ఆమెకు నచ్చలేదట.
నచ్చని ఆ సినిమాల పేర్లు మాత్రం పీవీ సింధు బయటపెట్టలేదు. అలా చెబితే కాంట్రవర్సీ అవుతుందని పీవీ సింధు అన్నారు. ఎందుకంటే నాకు నచ్చని సినిమా మరొకరికి నచ్చవచ్చు. అందరి అభిప్రాయాలు ఒకలా ఉండవు. ఏ హీరో అయినా సినిమా విజయం సాధింస్తుందనే చేస్తారు. నెలల తరబడి ఆ సినిమా కోసం కష్టపడతారని పీవీ సింధు అన్నారు.
గతంలో పీవీ సింధు నటిస్తారని వార్తలు వచ్చాయి. ఈ పుకార్లపై పై సైతం పీవీ సింధు స్పందించారు. ప్రస్తుతం తనకు నటించే ఆలోచన లేదన్నారు. నా దృష్టి ఆట మీదే. భవిష్యత్ నిర్ణయాల గురించి ఇప్పుడే చెప్పలేనని ఆమె అభిప్రాయపడ్డారు. ఇక తన బయోపిక్ లో ఎవరు నటిస్తే బాగుంటుందని అడగ్గా... బ్యాడ్మింటన్ గురించి తెలిసిన దీపికా పదుకొనె చేస్తే బాగుంటుందని సింధు అన్నారు. సింధు స్టార్ ప్లేయర్ గా పలు వ్యాపార ప్రకటనల్లో నటించారు. ఆమెకు మంచి ఫాలోయింగ్ ఉంది.