ప్రముఖ యాంకర్, నటి అనసూయ మరోసారి సోషల్ మీడియా బారీన పడ్డారు. అనసూయ పేరుతో అశ్లీల పోస్ట్ లు పెడుతూ, బూతు పదజాలం ఉపయోగించిన కొన్ని సోషల్ మీడియా అకౌంట్స్ కలకలం సృష్టిస్తున్నారు. వాటిని గుర్తించిన ప్రోగ్రెసివ్ యూత్ నాయకులూ సైబర్ క్రైం పోలీసులని ఆశ్రయించి ఫిర్యాదు నమోదు చేశారు. 

యాంకర్ అనసూయ పేరుతోనే నకిలీ సోషల్ మీడియా ఖాతాలు తెరిచి కొందరు ఈ సంఘటనలకు పాల్పడుతున్నట్లు తెలిసింది. వారిని వెంటనే గుర్తించి చర్యలు తీసుకోవాలని ప్రోగ్రెసివ్ యూత్ నాయకులు కోరారు 

పేస్ బుక్ లో అయితే కుప్పలు తెప్పలుగా అనసూయ పేరుతో నకిలీ ఖాతాలు ఉన్నాయి. వాటన్నింటిని తొలగించాలని కోరారు. ఇలాంటి సంఘటనల వల్ల అనసూయ కుటుంబ సభ్యులు ఇబ్బంది పడుతున్నట్లు తెలిపారు. అనసూయని ఇబ్బంది పెట్టేలా ఆమె ఇమేజ్ దెబ్బతినేలా ఏ అసభ్యకరమైన పోస్టులు ఉన్నట్లు తెలుస్తోంది.