కమల్ ఫ్యాన్స్ కి రెండు రోజులు పండగే.. మూడు సినిమాల అప్‌డేట్లు..?
విశ్వ నటుడుగా పాపులర్ అయిన కమల్ హాసన్ బ్యాక్ టూ బ్యాక్ సందడి చేయబోతున్నారు. ఆయన ప్రస్తుతం మూడు సిమాల నుంచి అప్‌డేట్లు రాబోతున్నాయి. కమల్ ఫ్యాన్స్ కి రెండు రోజులు పండగే.

లోకనాయకుడు కమల్ హాసన్ బ్యాక్ టూ బ్యాక్ సందడి చేయబోతున్నారు. రేపు మంగళవారం(నవంబర్ 7) కమల్ పుట్టిన రోజు ఉన్న నేపథ్యంలో ఆయన సినిమాలకు సంబంధించిన అప్‌డేట్లు వరుసగా రాబోతున్నాయి. రెండు రోజుల క్రితం `ఇండియన్ 2`(భారతీయుడు 2) చిత్రం నుంచి ట్రీట్ ఇచ్చింది. ఇంట్రో పేరుతో భారతీయుడిని పరిచయం చేశారు. మళ్లీ భారతీయుడు తిరిగి రావాలని జనం కోరుకుంటుండగా, ఎట్టకేలకు కమల్ వచ్చాడు. ఇండియన్ 2 ఈజ్ బ్యాక్ అంటూ ఎంట్రీ ఇచ్చారు. ఆయన లుక్ అదిరిపోయింది. అయితే ఇంట్రో ఆసక్తికరంగా లేదనే విమర్శలు వచ్చాయి. అయితే ఈ మూవీ రిలీజ్ డేట్‌పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
ఇదిలా ఉంటే ఇప్పుడు మణిరత్నం చిత్రం నుంచి కమల్ ఫస్ట్ లుక్ వచ్చింది. అంతేకాదు ఇందులో నటించే పాత్రలను కూడా పరిచయం చేస్తుంది యూనిట్. ఇందులో మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఆ విషయాన్ని టీమ్ ప్రకటించింది. ఈ సాయంత్రం ఐదు గంటలకు టైటిల్‌ని అనౌన్స్ చేయబోతున్నారు. దీనికి పవర్‌ఫుల్ టైటిల్ రాబోతుంది. `నాయకుడు` మూవీ తర్వాత మణిరత్నం, కమల్ హాసన్ కాంబినేషన్‌లో రాబోతున్న మూవీ కావడంతో దీనిపై మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ షూటింగ్ కూడా ఇటీవలే ప్రారంభమైంది.
దీంతోపాటు కమల్.. తెలుగులో ప్రభాస్‌తో `కల్కీ2898ఏడీ` చిత్రంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఆయనది నెగటివ్ రోల్ అని తెలుస్తుంది. రేపు లోకనాయకుడి పుట్టిన రోజు సందర్భాన్ని పురస్కరించుకుని కమల్ హాసన్ ఫస్ట్ లుక్‌ని విడుదల చేయబోతున్నారట. అమితాబ్ బచ్చన్, దీపికా, దిశా పటానీ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ మూవీకి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు. వైజయంతి మూవీస్ నిర్మిస్తుంది. సైన్స్ ఫిక్షన్‌గా ఇది రూపొందుతుంది. రెండు భాగాలు ఈ చిత్రం రానుంది. అయితే ఇందులో ఫ్లాష్ బ్యాక్‌లోవచ్చే వీఎఫ్ ఎక్స్ హైలైట్‌గా ఉంటాయని, విజువల్ వండర్‌లా ఉంటుందని టాక్.
మరోవైపు కమల్ హాసన్ మరో మూవీకి కమిట్ అయ్యాడు. అందులో హెచ్ వినోద్ దర్శకత్వంలో ఓ చిత్రం చేయబోతున్నారు. ఈ మూవీ నుంచి కూడా అప్‌డేట్ రాబోతుందని సమాచారం. చాలా రోజుల క్రితమేఈ చిత్రాన్ని ప్రకటించారు. ఓ గ్లింప్స్ ని విడుదల చేశారు. పొలిటికల్ థ్రిల్లర్‌గా ఈ సినిమా తెరకెక్కుతుందని సమాచారం. ఇలా బర్త్ డే సందర్భంగా ఈ రెండు రోజులు కమల్ ఫ్యాన్స్ కి పండగే పండగ అని చెప్పొచ్చు. కమల్ గతేడాది `విక్రమ్` మూవీతో హిట్ అందుకుని ఆయన మళ్లీ ట్రాక్‌లోకి వచ్చారు.