Nikhil : పుట్టబోయే బిడ్డపై నిఖిల్ ఎమోషనల్ కామెంట్స్.. యంగ్ హీరో ఇంట సందడి!

హీరో నిఖిల్ సిద్ధార్థ Nikhil Siddharatha ప్రస్తుతం పట్టలేని ఆనందంలో ఉన్నారు. తండ్రి కాబోతున్న ఈ యంగ్ హీరో తాజాగా తనకు పుట్టబోయే బిడ్డపై ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. 
 

Baby shower ceremony at Nikhil Siddhartha House NSK

యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ ప్రస్తుతం క్రేజీ ప్రాజెక్ట్స్ లో నటిస్తూ బిజీగా ఉన్నారు. చివరిగా ‘కార్తీకేయ’, ‘18 పేజెస్’, ‘స్పై’ వంటి చిత్రాలతో అలరించారు. విభిన్న కథలను ఎంచుకుంటూ తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇండస్ట్రీలో మరింతగా అభినందనలు అందుకుంటున్నారు. ప్రస్తుతం నిఖిల్ భారీ ప్రాజెక్ట్స్ లో నటిస్తూ బిజీగా ఉన్నారు. అప్డేట్స్ అందిస్తూనే వస్తున్నారు. మరోవైపు ఈ టాలెంటెడ్ హీరో తన పర్సనల్ లైఫ్ నుంచి కూడా గుడ్ న్యూస్ లు చెబుతున్నారు. 

నిఖిల్ తను ప్రేమించిన అమ్మాయి పల్లవి వర్మ Pallavi Varmaను నాలుగేళ్ల కిందనే పెళ్లి చేసుకున్నారు. 2020 మే 14న వీరి వివాహం ఘనంగా జరిగింది. మొన్నటి వరకు మ్యారీడ్ లైఫ్ ను లీడ్ చేశారు. ఇక తల్లిదండ్రులుగా మారబోతున్నామని ఇప్పటికే అప్డేట్ అందించారు.  తాజాగా నిఖిల్ వాళ్ల ఇంట్లో పల్లవి వర్మకు ఘనంగా సీమంతం చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను నిఖిల్ అభిమానులతో పంచుకున్నారు. ఈ సందర్భంగా తనకు పుట్టబోయే బిడ్డపై ఎమోషనల్ గా రాసుకొచ్చారు.  

పోస్ట్ లో ‘సీమంతం.. మా మొదటి బిడ్డ అతి త్వరలో రానుంది. ఇందుకు పల్లవి, నేను చాలా సంతోషంగా ఉన్నాం. మాకు మీకు దీవెనలు కూడా ఉండాలి.’.. అంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. దీంతో ఫ్యాన్స్, నెటిజన్లు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. బేబీ రాకతో మరింత సక్సెస్ చూస్తారని ఆస్తున్నారు. ఇక నిఖిల్ లైనప్ లో క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ‘స్వయంభు’, ‘ది ఇండియా హౌజ్’, ‘చైనా పీస్’ వంటి సినిమాలు రాబోతున్నారు. నెక్ట్స్ Swayambhu చిత్రం రిలీజ్ కానుంది.  

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios