క్రేజీ టైటిల్ ను రిజిస్టర్ చేయించిన ‘బేబీ’ నిర్మాత.. ఎవరి కోసం వాడుతారో.!
‘బేబీ’ నిర్మాత SKN తాజాగా ఓ క్రేజీ టైటిల్ ను రిజిస్టర్ చేయించారు. యంగ్ డైరెక్టర్లతో తన అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ ను అనౌన్స్ చేస్తుండటంతో ఎవరికోసం ఆ టైటిల్ ను వినియోగిస్తారనేది ఆసక్తికరంగా మారింది.
‘బేబీ’ సినిమాతో నిర్మాత శ్రీనివాస కుమార్ నాయుడు (SKN) మంచి సక్సెస్ అందుకున్నారు. దర్శకుడు సాయి రాజేశ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం రూ.90 కోట్లకు పైగా వసూళ్లు సాధించి అదరహో అనిపించింది. ఈ సినిమా ప్రమోషన్స్, ఈవెంట్స్, సక్సెస్ మీట్ల సమయంలో నిర్మాత ఎస్కేఎన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేస్తూ ఆడియెన్స్ కు గుర్తిండిపోయేలా చేసుకున్నారు. అప్పటి నుంచి ఏదోలా వార్తల్లో నిలుస్తూనే వస్తున్నారు.
ఆ మధ్యలో తన నెక్ట్స్ ప్రాజెక్ట్స్ పైనా అప్డేట్ అందించారు. నిర్మాతగా ప్రస్తుతం మంచి ఫామ్ ఉన్న ఆయన నలుగురు యంగ్ డైరెక్టర్లతో సినిమా చేయబోతున్నారని తెలుస్తోంది. మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈసారి ఏకంగా నాలుగు సినిమాలు నిర్మిస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. యంగ్ డైరెక్టర్ సాయి రాజేశ్, సందీప్ రాజ్, సుమన్ పాతూరి, రవి దర్శకత్వంలో ఆ ప్రాజెక్ట్స్ రూపుదిద్దుకోనున్నాయి.
అయితే తాజాగా నిర్మాత ఎస్కేఎన్ ‘కల్ట్ బొమ్మ’ (Cult Bomma) అనే టైటిల్ ను రిజిస్టర్ చేయించారు. బేబీ మూవీతో టాలీవుడ్ కు కల్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చారు. ప్రస్తుతం ఆయన మల్టీపుల్ ప్రాజెక్ట్స్ నిర్మిస్తున్నారు. వాటిలో రశ్మిక మందన్న (Rashmika Mandanna) లీడ్ రోల్ మూవీకి ది గర్ల్ ఫ్రెండ్ టైటిల్ అనౌన్స్ చేశారు. అలాగే సంతోష్ శోభన్ (Santosh Shoban), అలేఖ్య హారిక (Alekya Harika) జంటగా ఓ సినిమా, ఆనంద్ దేవరకొండ (Anand Devarakonda), వైష్ణవి చైతన్య హీరో హీరోయిన్లుగా మరో సినిమా ప్రొడక్షన్ లో ఉంది. మరి ఈ ‘కల్ట్ బొమ్మ’ అనే టైటిల్ ఏ సినిమాకు పెట్టబోతున్నారు అనేది ఆసక్తికరంగా మారింది. ఇవి రెండు కాకుండా కల్ట్ బొమ్మ టైటిల్ తో మరేదైనా కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేస్తారా అనేది చూడాలి. ఏమైనా బేబి ప్రమోషన్ లో కల్ట్ బ్లాక్ బస్టర్, కల్ట్ బొమ్మ అనే పదాన్ని తన స్పీచుల్లో ఎస్ కే ఎన్ బాగా వాడి, ఆ పదాలను పాపులర్ చేశారు. ఈసారి అదే టైటిల్ తో సినిమా చేస్తుండటం ఇంట్రెస్టింగ్ గా ఉంది.