Asianet News TeluguAsianet News Telugu

బేబి మూవీ డైరెక్టర్ సాయి రాజేశ్ కి బెంజ్ కారు గిఫ్ట్. నిర్మాత ఎస్కేఎన్ మరో కానుక

బేబీ మూవీ సక్సెస్ ను సెలబ్రేట్ చేస్తూనే ఉన్నారు టీమ్. అనూహ్య విజయంతో.. అనుకున్నదానికంటే ఎక్కువ లాభాలు, సంతోషాన్ని ఇచ్చింది సినిమా. దాంతో దర్శకుడు సాయి రాజేష్ కు సర్ ప్రైజింగ్ గిఫ్ట్స్ ఇచ్చారు నిర్మాత ఎస్కేఎన్. 
 

Baby Movie Producer Skn Gifted Benz Car To Director Sai Rajesh JMS
Author
First Published Sep 29, 2023, 9:44 PM IST | Last Updated Sep 29, 2023, 9:44 PM IST

బేబీ మూవీ సక్సెస్ ను సెలబ్రేట్ చేస్తూనే ఉన్నారు టీమ్. అనూహ్య విజయంతో.. అనుకున్నదానికంటే ఎక్కువ లాభాలు, సంతోషాన్ని ఇచ్చింది సినిమా. దాంతో దర్శకుడు సాయి రాజేష్ కు సర్ ప్రైజింగ్ గిఫ్ట్స్ ఇచ్చారు నిర్మాత ఎస్కేఎన్. 

ఆనంద్ దేవరకొండ (Anand Deverakonda), వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya), విరాజ్ అశ్విన్ (Viraj Ashwin)  ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా బేబీ. సాయి రాజేశ్ డైరెక్ట్ చేసిన ఈసినిమాను  శ్రీనివాస కుమార్ (SKN) నిర్మించాడు. కేవలం 10 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాస్టింగ్ కలెక్షన్స్ సాధించింది. దాదాపుగా  90 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి రికార్డు క్రియేట్ చేసింది.

 ఈ ఇయర్ కల్ట్ బ్లాక్ బస్టర్ మూవీగా సూపర్ సక్సెస్ అందుకుంది బేబి. ప్రేక్షకుల ఆదరణతో పాటు మెగాస్టార్ చిరంజీవి, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ లాంటి స్టార్ హీరోల అప్రిషియేషన్స్ అందుకుంది బేబి సినిమా. యూత్ ఫుల్ లవ్ ఎంటర్ టైనర్ గా ఈ  సినిమా  తెరకెక్కించారు. సాయి రాజేశ్ ఈసినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. అనుకోని విజయంతో పాటు.. భారీ కలెక్షన్లతో.. చిన్న సినిమాల్లో పెద్ద విజయాన్ని అందుకుంది. 

ఈ సక్సెస్ నేపథ్యంలో దర్శకుడు సాయి రాజేశ్ కు బెంజ్ కారు గిఫ్ట్ గా ఇచ్చారు నిర్మాత ఎస్కేఎన్.బేబి సినిమా రిలీజ్ ముందే రషెస్ చూసిన కాన్ఫిడెన్స్ తో డైరెక్టర్ సాయి రాజేశ్ కు ఒక కారు గిఫ్ట్ గా ఇచ్చిన నిర్మాత ఎస్కేఎన్...బేబి సక్సెస్ సంతోషంలో బెంజ్ కారు బహుమతిగా అందించారు. ఎస్కేఎన్, సాయి రాజేశ్ ఇండస్ట్రీకి రాకముందు నుంచీ మంచి ఫ్రెండ్స్. బేబి మూవీ సక్సెస్ వాళ్ల స్నేహానికి, ఒకరి మీద మరొకరికి ఉన్న నమ్మకానికి, సినిమా మేకింగ్ పట్ల ఉన్న ప్యాషన్ కు తగిన సక్సెస్ అందించింది. 

థియేటర్ లో సూపర్ హిట్ అయిన బేబి మూవీ ఓటీటీలోనూ రికార్డ్ స్థాయిలో వ్యూస్ దక్కించుకుంది. అయితే సాయి రాజేష్ కు మరో గిఫ్ట్ కూడా అందించాడు నిర్మాత.  తన నెక్స్ట్ సినిమా కూడా సాయి రాజేష్ డైరెక్షన్ లోనే చేయబోతున్నాడు ఎస్ .కే.ఎన్. మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కనుంది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios