మెగా డాటర్ నాగబాబు కూతురు నిహారిక పెళ్లి వేడుక బుధవారం ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. కుటుంబ సభ్యులందరి సమక్షంలో వెంకట చైతన్యను వివాహమాడింది నిహారిక. రాజస్థాన్ లోని ఉదయ్‌పూర్‌లో జరిగిన ఈ వేడుకకు మెగా ఫ్యామిలీ మొత్తం హాజరై సందడి చేశారు. ఈ వార్తలను దాదాపు అన్ని ప్రముఖ మీడియా సంస్దలు ప్రసారం చేసాయి. వివాహానికి సంభందించిన  ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రముఖ మీడియా సంస్థ బీబీసీ కూడా ఒక ప్రత్యేక కథనాన్ని నిహారిక వివాహంపై పబ్లిష్ చేసింది. 

ఈ నేపధ్యంలో నిహారిక పెళ్లి,  మీడియా హంగామా విషయమై రియాక్ట్ అవుతూ బాబు గోగినేని షాకింగ్ కామెంట్స్ చేశారు. అవి కూడా ఇప్పుడు వైరల్ అవుతున్నాయి హేతువాదిగా, నాస్తికుడిగా బిగ్ బాస్ కంటెస్టెంట్2 గా అందరికీ పరిచితమైన బాబు గోగినేని తమదైన శైలిలో నిహారిక వివాహ కవరేజీ పై కామెంట్లు విసిరారు. అయితే ఆ  వ్యాఖ్యలు మెగా అభిమానులకే కాకుండా, సామాన్యులకు కూడా చిరాకు తెప్పిస్తున్నాయి. దాంతో సోషల్ మీడియాలో ఆయనపై మండిపడుతున్నారు నెటిజన్లు. 

 బాబు గోగినేని చేసిన ఆ వ్యాఖ్యల్లో...“ BBC వారు పుణ్యం కట్టుకొని తిరుమల, యాదాద్రి లో దేవుళ్ళ నిద్రా శయనాల సమయాలూ, క్యూ టైమింగులు కూడా క్రమం తప్పకుండా చెప్తే మిగతా తెలుగు మాధ్యమాల లా మీరు లేరు ఏమిటీ అన్న బెంగ పోతుంది మాకు. టీవీ లో కనిపించే ఎకిలి నవ్వుల సెకండ్ గ్రేడ్ ఆర్టిస్ట్ కూతురు పెళ్లి ఇంకో రాష్త్రం లో జరుగుతుంటే, ఇప్పటివరకూ ఒకరి కూతురిగా కాక ఇంకే విధమైన సొంత achievement లేని వారి కథనాన్ని ఇంకో పత్రిక ప్రచురిస్తే, ఆ పత్రికలోని వందల కథనాలతో మీరు దీనిని ఎన్నుకుని దాన్ని మీ ప్రెస్ రివ్యూ లో ప్రచురించడం భలే సంబరంగా ఉంది. వెడ్డింగ్ కార్డ్ కూడా చూపిస్తే బాగుండేది.” అంటూ కోప్పడ్డారు బాబు గోగినేని.

ఈ వ్యాఖ్యల నేపధ్యంలో వెకిలి నవ్వుల సెకండ్ గ్రేడ్ ఆర్టిస్ట్ అంటూ నాగబాబు పై ఆయన చేసిన విమర్శలుకు మండిపడుతున్నారు. అలాగే  తాను హీరోయిన్ గా నటించిన సినిమాలలో తన పాత్రకు నీహారిక పూర్తి న్యాయం చేసిన సంగతి వారు గుర్తు చేస్తున్నారు.  అలాగే బాబు గోగినేని ఏమన్నా మహానుభావుడా..ఆయన మాత్రం సాధించిందేముంది అంటున్నారు.