బిగ్ బాస్ సీజన్ 2లో కంటెస్టంట్ గా పాల్గొన్న కౌశల్ కోసం కౌశల్ ఆర్మీ తయారైంది. వారు షోపై ఎంతగా ప్రభావం చూపారంటే చివరకు టైటిల్ కౌశల్ కే ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. షోలో కౌశల్ ఉన్నంత కాలం కౌశల్ ఆర్మీ మిగిలిన కంటెస్టంట్స్ ని టార్గెట్ చేసి వారిపై ట్రోల్ చేసి రెచ్చిపోయేవారు.

చివరకు హోస్ట్ నానిని కూడా విడిచి పెట్టలేదు. అయితే ఇప్పుడు కౌశల్ ఆర్మీ సభ్యులు స్వయంగా కౌశల్ పై ఆరోపణలు చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఈ క్రమంలో మొదటి నుండి కౌశల్ ఆర్మీ పెయిడ్ ఆర్మీ అంటూ చెబుతూ వస్తోన్న బాబు గోగినేని కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేశారు.

కౌశల్ ఆర్మీ గుట్టు రట్టయిందని.. దొంగలు పట్టుబడ్డారని అన్నారు. ఇప్పటివరకు కౌశల్ ఆర్మీ పెయిడ్ ఆర్మీ అని మాట్లాడుకున్నామని, ఇది పేయింగ్ ఆర్మీ కూడా అంటూ కామెంట్ చేశారు. ఎన్నో యూట్యూబ్ ఛానల్స్ ఒక రౌడీ మూకకు అవకాశాలు కల్పిస్తూ వారితో ఇష్టం వచ్చినట్లు మాట్లాడించారని మండిపడ్డారు. ఫైనల్ గా కౌశల్ ఆర్మీ నిజస్వరూపం బయటపడిందన్నారు.

కౌశల్ ఆర్మీ వారిలో వారిలో వారే కొట్లాడుకొని కౌశల్ తిట్టేసి వారేదో పవిత్ర గంగాజలంలో మునిగినట్లు ప్రవర్తిస్తున్నారని.. గతంలో వీరే కౌశల్ ఆర్మీ పేరుతో చాలా మందికి ఇబ్బంది పెట్టారని గుర్తు చేశారు.