ఇండియన్ బాక్స్ ఆఫీస్ దర్శకుడు శంకర్ నెక్స్ట్ భారతీయుడు సీక్వెల్ తో సిద్దమవుతున్న సంగతి తెలిసిందే. డిసెంబర్ 14న కమల్ హాసన్ తో రెగ్యులర్ షూటింగ్ ను శంకర్ స్టార్ట్ చేయనున్నాడు. ఇక హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ ని కూడా సరికొత్తగా చూపించడానికి ఈ సంచలన దర్శకుడు ప్రయోగాలు చేస్తున్నాడు. 

అసలు విషయంలోకి వస్తే.. సినిమాకు సంబందించిన ఒక రూమర్ గత కొన్ని రోజులుగా అందరిని కన్ఫ్యూజన్ కి గురి చేస్తోంది. అదేమిటంటే సినిమాలో విలన్ గా  మరో బాలీవుడ్ హీరోని శంకర్ తన సినిమాకు సెట్ చేసుకున్నట్లు కథనాలు వెలువడ్డాయి. సీనియర్ హీరో అజయ్ దేవగన్ అందుకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చినట్లు బాలీవుడ్ మీడియాలో సైతం వార్తలు వచ్చాయి. 

అయితే ఈ విషయంపై దర్శకుడు శంకర్ వీలైనంత త్వరగా క్లారిటీ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాడు. సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం భారతీయుడు 2లో అజయ్ దేవగన్ విలన్ పాత్ర చేయడం లేదని తెలుస్తోంది. అయితే సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యే ముందు రూమర్స్ మరింత వైరల్ అవ్వకముందే ఈ విషయంలో శంకర్ వివరణ ఇవ్వనున్నట్లు సమాచారం.