Asianet News TeluguAsianet News Telugu

బాహుబలి రైటర్ అప్పుడు రూ.500, ఇప్పుడు రూ.2000!

ఎన్నో ఏళ్లుగా సినిమా ఇండస్ట్రీలో రైటర్ గా పని చేస్తోన్న విజయేంద్రప్రసాద్ తన కొడుకు డైరెక్ట్ చేసిన 'బాహుబలి' సినిమాకి కథ అందించి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్నారు. సల్మాన్ ఖాన్ నటించిన 'భజరంగి భాయ్ జాన్' కి కూడా కథ అందించింది విజయేంద్రప్రసాదే.. 

Baahubali Writer's '2000 Note' Habit
Author
Hyderabad, First Published Nov 3, 2018, 5:00 PM IST

ఎన్నో ఏళ్లుగా సినిమా ఇండస్ట్రీలో రైటర్ గా పని చేస్తోన్న విజయేంద్రప్రసాద్ తన కొడుకు డైరెక్ట్ చేసిన 'బాహుబలి' సినిమాకి కథ అందించి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్నారు. సల్మాన్ ఖాన్ నటించిన 'భజరంగి భాయ్ జాన్' కి కూడా కథ అందించింది విజయేంద్రప్రసాదే..

ఈ సినిమాతో అతడికి బాలీవుడ్ లో క్రేజ్ పెరిగింది. ప్రస్తుతం అతడు రాజమౌళి 'RRR' సినిమాకి కథను సిద్ధం చేస్తున్నారు. అయితే విజయేంద్రప్రసాద్ కి ఓ అలవాటు ఉందట. తనకి ఓ మంచి ఐడియా చెప్పినా, నచ్చే విధంగా పని చేసిన వారికి తన బహుమతిగా డబ్బు ఇస్తుంటాడట. ఇంతకముందు రూ.500 నోటుని ఇచ్చేవాడట.

ఇప్పుడు ఒక్కో సినిమాకి మూడు నుండి నాలుగు కోట్లు తీసుకుంటున్న ఆయన తన బహుమతి విలువ కూడా పెంచి రెండు వేలు చేసినట్లు తెలుస్తోంది. తమ దగ్గర పని చేసే అసిస్టెంట్లు, డైలాగ్ రైటర్స్, ఎడిటర్ ఇలా ఎవరైనా చేసిన పని అతడికి నచ్చితే వెంటనే రూ.2000 నోటు వారి చేతిలో పెడతాడని తెలుస్తోంది.

ఇలా చేయడం ద్వారా వారిని మరింత ప్రోత్సహించినట్లు అవుతుందనేది అతడి ఆలోచన. దీనికోసం అతడి ఆఫీస్ టేబుల్ దగ్గర రెండు వేల నోట్ల కట్ట ఎప్పుడూ ఉంటుందని సమాచారం. 

Follow Us:
Download App:
  • android
  • ios