‘బాహుబలి’ సీరిస్ కు శివగామి ట్విస్ట్
ఈ వెబ్‌సీరీస్‌లో ప్రధాన పాత్ర శివగామిగా ఉత్తరాది నటి మృణాల్ థాకూర్ కనిపించనుంది. సిల్వర్ స్క్రీన్‌పై రమ్యకృష్ణ నట విశ్వరూపం చూపించిన పాత్రలో ఉత్తరాది అందాల నటి ఆకట్టుకుంటుందని లెక్కేసారు.
బాహుబలి ప్రపంచ వ్యాప్తంగా ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే. అందుకే బాహుబలి ప్రపంచాన్ని విస్తరిస్తూ, కొనసాగించే ప్రయత్నాల్లో కార్పోరేట్ ప్రపంచం ఉంది. అందులో భాగంగా బాహుబలికి ప్రీక్వెల్‌గా ఓ వెబ్ సీరీస్‌ను నిర్మించారు నిర్మాతలు. బాహుబలి కథకు ముందు శివగామి బాల్యం, ఆమె ఎదుగుదల ప్రధానాంశంగా ఈ వెబ్ సీరీస్ తెరకెక్కింది.ఈ సీరిస్ కి దేవకట్టా, ప్రవీణ్ సత్తారు డైరక్షన్ చేసారు. అయితే ఈ సీరిస్ ని నెట్ ప్లిక్స్ వాళ్లు తమకు తగ్గ క్వాలిటీ లేదని ప్రక్కన పెట్టేసారు. రీషూట్ కు ఆదేశించారు.అయితే ఇప్పుడు రీషూట్ కు సమస్య ఎదురైందని సమాచారం.
ఈ వెబ్‌సీరీస్‌లో ప్రధాన పాత్ర శివగామిగా ఉత్తరాది నటి మృణాల్ థాకూర్ కనిపించనుంది. సిల్వర్ స్క్రీన్‌పై రమ్యకృష్ణ నట విశ్వరూపం చూపించిన పాత్రలో ఉత్తరాది అందాల నటి ఆకట్టుకుంటుందని లెక్కేసారు. అయితే ఇప్పుడామె తాను ఇంకెంత కాలం ఈ సీరిస్ లో నటించాలి..తను సినిమా ప్రపంచానికి దూరం అయ్యిపోతున్నాను బెంగపెట్టుకుందిట. దాంతో వేరొక టీమ్ తో చేస్తున్న రీషూట్ లలో ఆమె చేయనని చెప్పేసిందిట. ఆమె ఎగ్రిమెంట్ ప్రకారం ఇచ్చిన డేట్స్ ఎప్పుడో పూర్తైపోయాయి.
కాబట్టి ఇప్పుడు ఆమెకు ఇష్టమైతేనే చేస్తుంది. లేకపోతే లేదు. దాంతో ఇప్పుడేమి చేయాలి. ఆమెను కాదని వెళ్లిపోతే ఆమె భాగం మొత్తం రీషూట్ చేయాలి. అది ఇంకా పెద్ద పని. ఈ విషయమై ఆమెతో చర్చలు జరుపుతున్నారట. మరి ఆమె ఏం చేస్తుంది అనేదానిపై బాహుబలి సీరిస్ లో ఆమె ఉంటుందా లేదా అన్నది తేలిపోతుంది. ఇక కుంకుమ్ భాగ్య సీరియల్‌లో బుల్ బుల్ పాత్రలో ఆకట్టుకున్న మృణాల్.. ఆ మధ్యన హృతిక్ రోషన్ హీరోగా తెరకెక్కుతున్న సూపర్ 30లో నటించింది. ఇప్పుడామె దృష్టి మొత్తం సినిమాలపై ఉంది.
ఈ సిరీస్ రీషూట్ ఎపిసోడ్స్ ని బాలీవుడ్ దర్శకుడు విశ్వేశ్ కృష్ణమూర్తి తెరకెక్కించే అవకాశం కనిపిస్తోంది. ఈ మేరకు ఫైనల్ స్క్రిప్ట్ తో నెట్ ఫ్లిక్స్ ని సంప్రదించాడని వాళ్లకు నచ్చడంతో త్వరలో మెదలు పెట్టబోతున్నట్లు సమాచారం. ఇక ఈ సీరిస్ కు మూలం...బాహుబలి రెండు పార్ట్ లు ఆధారంగా ఆనంద్ నీలకంఠన్ అనే నవలా రచయిత ఇంగ్లీష్ లో “ది రైజ్ అఫ్ శివగామి” అనే పుస్తకం. దాన్ని తెలుగులోకి అనువదించారు. ఈ పుస్తకం ఆధారంగానే నెట్ ఫ్లిక్ ‘బాహుబలి: బిఫోర్ ది బిగినింగ్’ పేరుతో రెండు సీజన్ల లక్ష్యంతో భారీ ఎత్తున ఇన్వెస్ట్ చేసింది. బాహుబలిని తెరకెక్కించిన ఆర్కా మీడియా వర్క్స్ కూడా ఇందులో భాగంగా ఉంది. ఈసారి 200 కోట్ల రూపాయల బడ్జెట్ ని కేటాయించిందని సమాచారం.