దర్శకధీరుడు ఎస్. ఎస్. రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో.. ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం అద్భత విజయం సాధించి.. కొన్ని వేల కోట్ల వసూళ్లు రాబట్టింది.

అయితే ఈ సినిమా విడుదలై ఇప్పటికే రెండు సంవత్సరాలు అవుతున్నా.. క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. అయితే అందరూ దాదాపు తమ భాషల్లోకి డబ్ చేసుకుని ఈ సినిమాని చూసి ఆనందించారు. కానీ ఇప్పుడు గుజరాత్ కు చెందిన నిర్మాతల మాత్రం  ఈ సినిమా ని రీమేక్ చేయాలని ఇంతకాలానికి రైట్స్ కొన్నట్లు సమాచారం. 

అందుతున్న సమాచారం మేరకు యూట్యూబ్ ప్రపంచం ఏలుతున్న నితిన్ జనాని, తరుణ్ జాని లు ఈ రైట్స్ ని భారీ మొత్తానికి సొంతం చేసుకున్నారు. ఆ స్దాయి సెట్స్ వేసి బాహుబలి ని రీక్రియేట్ చేయటం అంటే మాటలు కాదు. మరి ఏం చేస్తారో చూడాలి. ఇప్పటికే  ఈ సినిమాని భోజ్‌పూరి నటుడు దినేశ్‌ లాల్‌ యాదవ్‌ నిరహువా రీమేక్ చేసాడు. దీనికి  ‘వీర్‌ యోధ మహాబలి’ పేరు పెట్టారు.

అమ్రపాలి డుబే ఇందులో హీరోయిన్ గా నటిస్తున్నారు.  ఈ సినిమాను హిందీ, తెలుగు, తమిళ్‌, బెంగాళీ, భోజ్‌పూరి భాషల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నట్లు తెలిపారు. ఇక్బాల్‌ బక్ష్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. కొన్ని ఆంగ్ల పత్రికలు కూడా ఇది భాహుబలి రీమేక్ ని కథనాలు ప్రచురించాయి.   అయితే ప్రకటన వచ్చి ఇంతకాలం అయినా సినిమా మాత్రం రాలేదు.