సన్ రైజర్స్ టీమ్ ప్లేయర్ దేవిడ్ వార్నర్ ఇప్పుడు తెలుగు జనాలకు బాగా దగ్గరైపోయాడు. ఆస్ట్రేలియా ఆటగాడైనప్పటికీ ఇండియాలోనే మనోడికి గట్టి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతోంది. ఏడాది పాటు నిషేధానికి గురైన డేవిడ్ ఐపీఎల్ లో దెబ్బ్బ తిన్న పులిలా బౌలర్లపై బాహుబలి రేంజ్ లో విరుచుకుపడుతున్నాడు.

అయితే ఈ విదేశీ ఆటగాడికి బాహుబలి సినిమా అంటే కూడా చాలా ఇష్టమట. రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో సినిమా పరంగా వెళితే బాహుబలి అంటే చాలా ఇష్టమని అలాంటి సినిమాలను ఎంచుకుంటానని చెప్పగా బాహుబలి టీమ్ ట్విట్టర్ ద్వారా వార్నర్ కి రిప్లై ఇచ్చింది.
హే.. వార్నర్.. మీ ఇష్టాన్ని మేము విన్నాం.. ఇంతకు మీరు ఎవరి వైపు ఉండాలని అనుకుంటుంన్నారు. బాహువైపా.. బల్లా వైపా? బాహుబలి 3వ పార్ట్ కి సిద్ధమవ్వండి అంటూ సరదాగా సమాధానం ఇచ్చారు. అందుకు సంబందించిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.