Asianet News TeluguAsianet News Telugu

నెంబర్‌ వన్‌గా అవతరించిన ప్రభాస్‌.. వెనకబడిన బన్నీ, మహేష్!

సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్‌గా ఉండకపోయినా ప్రభాస్‌కు ఫాలోయింగ్ మాత్రం భారీగానే ఉంది. ఈ మధ్యే ఫేస్‌బుక్‌లో కోటీ 40 లక్షల మంది ఫాలోవర్స్‌ మార్క్‌ను అందుకొని దక్షిణాదిలో ఆ ఘనత సాధించిన తొలి స్టార్‌గా రికార్డ్ సృష్టించాడు ప్రభాస్‌. మరో నెల రోజుల వ్యవధిలోనే 15 మిలియన్ల (15 లక్షల) ఫాలోవర్స్‌ను సాధించి సరికొత్త రికార్డ్‌ను సృష్టించాడు. 

Baahubali star Prabhas beats Allu Arjun
Author
Hyderabad, First Published Jul 8, 2020, 5:00 PM IST

బాహుబలి సినిమాతో ప్రభాస్ ఇమేజ్‌ తారా స్థాయికి చేరింది. ఈ సినిమా తెలుగుతో పాటు హిందీలోనూ ఘన విజయం సాధించటంతో ప్రభాస్‌ పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు. మన దేశంలోనే కాదు బాహుబలి ఇతర దేశాల్లో కూడా ఘనవిజయం సాధించటంతో పాటు భారీగా వసూళ్లు సాధించింది. దీంతో ప్రభాస్‌కు సోషల్ మీడియాలోనూ భారీ ఫాలోయింగ్‌ ఏర్పడింది. తరువాత సాహో సినిమాతో నిరాశపరిచినా ప్రభాస్‌ ఇమేజ్‌ మాత్రం తగ్గలేదు.

సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్‌గా ఉండకపోయినా ప్రభాస్‌కు ఫాలోయింగ్ మాత్రం భారీగానే ఉంది. ఈ మధ్యే ఫేస్‌బుక్‌లో కోటీ 40 లక్షల మంది ఫాలోవర్స్‌ మార్క్‌ను అందుకొని దక్షిణాదిలో ఆ ఘనత సాధించిన తొలి స్టార్‌గా రికార్డ్ సృష్టించాడు ప్రభాస్‌. మరో నెల రోజుల వ్యవధిలోనే 15 మిలియన్ల (15 లక్షల) ఫాలోవర్స్‌ను సాధించి సరికొత్త రికార్డ్‌ను సృష్టించాడు. అంతేకాదు ఈ రికార్డ్ సాధించిన తొలి దక్షిణాది హీరో ప్రభాసే కావటం విశేషం.

ప్రభాస్‌ తరువాతి స్థానంలో 13.2 మిలియన్ల ఫాలోవర్స్‌తో స్టైలిష్ స్టార్‌ అల్లు అర్జున్‌ ఉన్నాడు. ఈ లిస్ట్‌ లో మూడో స్థానంలో 9.6 మిలియన్లతో మహేష్ బాబు, తరువాతి స్థానాల్లో.. 8.3 మిలియన్ల ఫాలోవర్స్‌తో రామ్‌ చరణ్‌, 4.4 మిలియన్ల ఫాలోవర్స్‌ ఎన్టీఆర్, 3.1 మిలియన్ల ఫాలోవర్స్‌తో విజయ్‌ దేవరకొండ ఉన్నారు.

ఇక సినిమాల విషయానికి వస్తే సాహో తరువాత లాంగ్ గ్యాప్‌ తీసుకున్న ప్రభాస్ ప్రస్తుతం ఓ పీరియాడిక్‌ రొమాంటిక్‌ డ్రామాలో నటిస్తున్నాడు. ఈ సినిమాను ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ ఈ నెల 10న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు చిత్రయూనిట్. ఈ సినిమాతో పాటు హృతిక్‌ రోషన్‌ తో కలిసి ఓ భారీ మల్టీస్టారర్ సినిమాలో నటించేందుకు రెడీ అవుతున్నాడన్న ప్రచారం జరుగుతోంది.

Follow Us:
Download App:
  • android
  • ios