రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రూపొందిన బాహుబలి చిత్రం ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం విజయంతో ఆ నిర్మాతలు(శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని) తమ తర్వాత ప్రాజెక్టుని అంతకన్నా ప్రెజ్టేజియస్ గా రూపొందించాలనుకున్నారు. అయితే అందుకు తగ్గ కథ గానీ, దర్శకుడు కానీ సెట్ కాలేదు. దాంతో వాళ్లు తమ దృష్టిని వెబ్ సీరిస్ ల పైన పెట్టారు.

అయితే ఏదో  ఒక వెబ్ సీరిస్ తీసి ఆగిపోదలచుకోలేదు. అది కూడా బాహుబలి రేంజిలో భారీ ఎత్తున చేయాలనుకుంటున్నారు.  తమ ప్రొడక్షన్స్ వ్యాల్యూస్, ప్రమోషన్ టెక్నిక్స్ తో వెబ్ సీరిస్ మార్కెట్ ని కైవసం చేసుకోవాలనే ప్లానింగ్ లో ఉన్నట్లు సమాచారం. ఈ మేరకు వాళ్లు సీరియస్ గా గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు.  అన్ని లీడింగ్ డిజిటల్ ప్లాట్ ఫామ్ లకు కంటెంట్ ప్రొవడైర్స్ గా ఉండేందుకు డిసైడ్ అయ్యారు . 

వెబ్ సీరిస్ లు వరసగా నిర్మించటం కోసం ...దర్శకులను  ఎంపిక చేయటం, కథ లు వినటం చేస్తున్నారు. ఓ లావిష్ ఆఫీస్ ని హైదరాబాద్ లో ఓపెన్ చేసి టాలెంట్ కోసం అన్వేషణ జరుపుతున్నారు. ఓ టీమ్ ప్రత్యేకంగా వెబ్ సీరిస్ కి సంభందించిన కంటెంట్ ని ,కాన్సెప్ట్ లను ఫైనలైజ్ చేస్తుంది. నిర్మాత శోభు యార్లగడ్డ పర్శనల్ గా మానిటర్ చేస్తున్నారు.  ప్రీ ప్రొడక్షన్ వర్క్, స్క్రిప్టు వర్క్ ని ఆయన దగ్గరుండి చూస్తున్నారు. త్వరలోనే తమ ప్రాజెక్టుల గురించి, కొలాబిరేషన్స్ గురించి ప్రకటన చేయనున్నారు. 

ఇక ఇప్పటికే బాహుబలి సినిమా నిర్మాతలు శివగామి పాత్ర ప్రధానంగా ఓ వెబ్ సీరీస్ ను రూపొందిస్తున్నారు. బాహుబలి ప్రీక్వెల్ కథతో రాబోతున్న ఈ వెబ్ సీరీస్ ను దేవా కట్ట డైరెక్ట్ చేస్తాడని తెలుస్తుంది. అయితే ఈ వెబ్ సీరీస్ కూడా మూడు భాషల్లో తెరకెక్కిస్తున్నారట. తెలుగు దర్శకుడే హింది వెబ్ సీరీస్ ను డైరెక్ట్ చేస్తాడని తెలుస్తుంది.  

 

ఇప్పటికే బాహుబలి నిర్మాతలు స్వర్ణ ఖడ్గం సీరియల్ మొదలు పెట్టారు. బాహుబలి సెట్స్ లో ఈ సీరియల్ షూట్ చేయడం జరిగింది. ఇక ఇప్పుడు వెబ్ సీరీస్ కూడా ఆ నిర్మాతలు ప్రొడ్యూస్ చేస్తున్నారు. బాహుబలి క్రేజ్ ను నిర్మాతలు ఇప్పుడప్పుడే వదిలేలాలేరు. ప్రస్తుతం ఈ వెబ్ సీరీస్ మీదే అందరి దృష్టి ఉంది.