Asianet News TeluguAsianet News Telugu

ఒక్క భారత దేశంలోనే వెయ్యికోట్ల రూపాయల వసూళ్లు

  • 1500 కోట్ల కలెక్షన్స్ దిశగా దూసుకెళ్తున్న బాహుబలి 2
  • తాజాగా కేవలం భారత దేశంలోనే వెయ్యి కోట్ల రూపాయల వసూళ్లు
  • దేశంలోని సినిమాల కలెక్షన్స్ రికార్డులన్నీ తారుమారు
BAAHUBALI CROSSES 1000 CRORE COLLECTIONS IN INDIA

తెలుగు సినిమా కీర్తిని ప్రపంచ నలుమూలలా చాటిన బాహుబలి చిత్రం విడుదలైన తొలి రోజు నుంచి కలెక్షన్ల రికార్డుల ప్రకంపనలు రేపుతోంది. ఇప్పటికే  భారతీయ సినిమాల కలెక్షన్ల రికార్డులన్నీ బద్దలైపోయాయి. హాబుబలి ది  కన్ క్లూజన్ రోజుకో కొత్త మైలురాయిని అందుకుంటూ దూసుకెళ్తోంది. 



వరల్డ్ వైడ్ రూ.1000 కోట్ల కలెక్షన్లు సాధించిన తొలి భారతీయ చిత్రంగా తొలి వారంలోనే ‘బాహుబలి-2’ రికార్డు నెలకొల్పిన సంగతి తెలిసిందే. విశేషం ఏంటంటే.. ఇప్పుడీ సినిమా ఒక్క ఇండియాలోనే వెయ్యి కోట్ల వసూళ్లు సాధించడం విశేషం. ఇందులో తెలుగు వెర్షన్ మాత్రమే రూ.300 కోట్ల దాకా గ్రాస్ వసూలు చేయగా... హిందీ వెర్షన్ వసూళ్లు రూ.400 కోట్లు దాటాయి. తమిళం.. మలయాళం వెర్షన్లు కూడా కలిపి రూ.1000 కోట్ల గ్రాస్ పూర్తయింది. ‘బాహుబలి-2’ వరల్డ్ వైడ్ వసూళ్లు రూ.1300 కోట్ల మార్కుకు చేరువగా ఉన్నాయి. ఈ వీకెండ్లో వంద కోట్లయినా జమ అవుతాయని భావిస్తున్నారు.

 

బాహుబలి సినిమా ఫుల్ రన్లో రూ.1500 కోట్ల మైలురాయిని అందుకోవడం ఖాయం. ఇప్పుడప్పుడే ఈ రికార్డు బద్దలవడం కష్టమే. కేవలం అమెరికాలో మాత్రమే ‘బాహుబలి-2’ రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టడం విశేషం. లండన్.. దుబాయ్ లాంటి చోట్ల కూడా బాహుబలి-2 వసూళ్లు అనూహ్యంగా ఉన్నాయి. దేశ విదేశాల్లో బాహుబలి ఫ్యాన్స్ పెరిగిపోవడంతో మరికొన్ని ఇతర బాషల్లోనూ రిలీజ్ చేసే ఉద్దేశంతో ఉన్నారు నిర్మాతలు.

Follow Us:
Download App:
  • android
  • ios