కథా కథనాల్లో కొత్తదనం ..చేసే క్యారక్టర్ లో  వైవిధ్యం ఉండాలేగానీ, ఏ భాషా చిత్రం చేయడానికైనా దగ్గుపాటి రానా రెడీ అవుతూంటాడు. అయితే  ఏ పాత్ర చేసినా  ఆయన కెరీర్ లో సూపర్ హిట్ చిత్రంగా నిలిచిన బాహుబలి ముద్ర మాత్రం ఆయన్ను వెంటాడుతూనే ఉంటుంది. ఆ పాత్ర ఇప్పుడు మరోసారి  'హౌస్ ఫుల్ 4' సినిమా లో కనపడనుందని సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముంబైలో జరుగుతోంది. అక్కడ జరుగుతోన్న మేజర్ షెడ్యూల్లో రానా పాల్గొంటున్నాడు. ఈ సినిమాలో ఆయన జై సింగ్ భళ్లాళదేవ పాత్రలో కనిపించనున్నాడు. ఆ పాత్ర కు కేవలం బాహుబలి లో పేరు మాత్రమే వాడారా లేక ఈ సినిమాకు ఏమన్నా లింక్ ఉందా అనేది మాత్రం తెలియాల్సి ఉంది.  

సాజిద్ నడియాడ్ వాలా నిర్మిస్తోన్న ఈ సినిమాకి ఫర్హాద్ దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. అక్షయ్ కుమార్ .. రితేశ్ దేశ్ ముఖ్ .. బాబీ డియోల్ .. కృతీ సనన్ .. కృతి కర్బందా .. పూజా హెగ్డే ఈ సినిమాలో ప్రధానమైన పాత్రలను పోషిస్తున్నారు. ఈ సినిమాలో తాను చేస్తోన్న పాత్ర చాలా విభిన్నంగా ఉంటుందనీ .. తన నటనలో మరో కోణాన్ని ఈ పాత్ర ద్వారా ఆవిష్కరించే అవకాశం కలిగిందని రానా చెబుతున్నాడు.   `హౌస్ ఫుల్ 4` షూటింగ్  పూర్తయి నిర్మాణానంతర పనులు పూర్తి చేసుకుంటోంది. త్వరలోనే రిలీజ్ కి రెడీ అవుతోంది.

తాజాగా ఓ చిట్ చాట్ లో హౌస్ ఫుల్ సెట్స్ లో తన అనుభవాల గురించి రానా చెప్పాడు. కిలాడీ అక్షయ్ కుమార్ తో సెట్స్ లో ఎంతో ఫన్నీగా సాగిపోయిందని.. షూటింగ్ ఆద్యంతం ఒకటే సందడిగా సాగిందని తెలిపాడు. షూటింగ్ అనే కంటే ఒక పార్టీలా ఎంజాయ్ చేశామని రానా ఆన్ లొకేషన్ సందడిని వెల్లడించారు.