డబ్బు తీసుకొని మోసం చేశారు.. బాలీవుడ్ తారలపై కేసులు!

B-town stars sued by Chicago-based Vibrant Media Group
Highlights

బాలీవుడ్ కు చెందిన సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్, రన్ వీర్ సింగ్, ప్రభుదేవా, సోనాక్షి సిన్హా

బాలీవుడ్ కు చెందిన సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్, రన్ వీర్ సింగ్, ప్రభుదేవా, సోనాక్షి సిన్హా ఇంకా మరికొందరు ప్రముఖులు డబ్బు తీసుకొని తమను మోసం చేశారంటూ.. వైబ్రంట్ మీడియా వారందరిపై దావా వేసింది. అమెరికాలో ఓ కాన్సర్ట్ నిర్వహించాలనే ప్లాన్ తో వైబ్రంట్ మీడియా బాలీవుడ్ తారలతో మిలియన్ డాలర్లకు ఒప్పందం కుదుర్చుకున్నాయి. దాని ప్రకారం ఐదేళ్ల కిందట ఈ కాన్సర్ట్ జరగాల్సివుంది.

కానీ కొన్ని కారణాల వలన ఈ కార్యక్రమాన్ని వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. దీంతో తాము తీసుకున్న అడ్వాన్సులు తిరిగి ఇచ్చేస్తామని చెప్పిన తారలు మాట మీద నిలబడలేదని మిలియన్ డాలర్లు తీసుకొని ఇప్పుడు తమకు స్పందించడం మానేశారని పిటిషన్ లో పేర్కొన్నారు. సల్మాన్ ఖాన్ ఒక్కడికే రెండు లక్షల డాలర్లను పారితోషికంగా ఇచ్చినట్లు తెలిపారు. అలానే కత్రినాకు 40 వేల డాలర్లు, సోనాక్షికి 36 వేల డాలర్లు ఇచ్చారట.

ఇందులో ఏ ఒక్కరూ కూడా తమకు డబ్బు తిరిగివ్వలేదని వీరి కారణంగా తమ కంపనీకు మిలియన్ డాలర్ల నష్టం వాటిల్లిందని ఆ డబ్బుని వారు చెల్లించాలని డిమాండ్  చేస్తున్నారు. మరి ఈ విషయంపై తారలు ఎలా స్పందిస్తారో చూడాలి!

loader