ఆయుష్మాన్ ఖురానా.. గత రెండేళ్ల నుంచి బాలీవుడ్ లో హాట్ టాపిక్ అవుతున్న నేమ్ ఇదే. బుల్లితెర నుంచి ఎంతో కష్టపడి వెండితెరకు వచ్చిన ఈ యువ హీరో వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. ఇక ఇప్పుడు పుట్టినరోజు కానుకగా ఆడియెన్స్ నుంచి మరో బాక్స్ ఆఫీస్ గిఫ్ట్ అందుకున్నాడు. 

గత ఏడాది అందధూన్ తో ఆయుష్మాన్ స్టార్ హీరోల రేంజ్ లో కలెక్షన్స్ అందుకున్నాడు.32కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఆ సినిమా 450కోట్లకు పైగా కలెక్షన్స్ తో అందరికి షాకిచ్చింది. ఆర్టికల్ 15 - బడాయి హో వంటి సినిమాలు కూడా ఈ హీరో రేంజ్ ని పెంచాయి. ఫైనల్ గా గత శుక్రవారం డ్రీమ్ గర్ల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయుష్మాన్ ఆడియెన్స్ ని మెప్పించాడు. 

గత శనివారం 35వ బర్త్ డే జరుపుకున్న ఈ హీరోకి ఆడియెన్స్ రెండవరోజు కూడా అదిరిపోయే కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ గిఫ్ట్ ఇచ్చారు. ఇక మొదటిరోజే ఈ సినిమా 10కోట్లకు పైగా కలెక్షన్స్ ని అందుకుంది. ప్రస్తుతం పోటీగా ఛిచ్చోరె సినిమా ఉన్నప్పటికీ డ్రీమ్ గర్ల్ కలెక్షన్స్ ఏ మాత్రం తగ్గడం లేదు.  ఫస్ట్ వీకెండ్ లొనే సినిమా బ్రేక్ ఈవెన్ తో నిర్మాతలకు లాభాలను అందించినట్లు సమాచారం.