కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ ఈ మధ్య గ్యాప్ లేకుండా సినిమాలను వదులుతున్నాడు. అలాగే సక్సెస్ రేట్ ను కూడా పెంచుకుంటున్న ఈ హీరో చాలా రోజుల తరువాత ఒక తెలుగు రీమేక్ తో రాబోతున్నాడు. ఎన్టీఆర్ కెరీర్ కు మంచి బూస్ట్ ఇచ్చిన టెంపర్ సినిమాను అయోగ్య పేరుతో రీమేక్ చేస్తున్నారు. 

[రానున్న తెలుగు సినిమాల రిలీజ్ డేట్స్.. (అప్డేట్)

విశాల్ దాదాపు ఎన్టీఆర్ స్టైల్ ని ఫాలో అయినట్లు తెలుస్తోంది. రీసెంట్ గా బాలీవుడ్ లో సింబా పేరుతో రిలీజైన టెంపర్ రీమేక్ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టింది. ఇక ఇప్పుడు విశాల్ తమిళ్ టెంపర్ కథను అయోగ్యగా  వదలబోతున్నాడు. వెంకట్ మోహన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను బి.మధు నిర్మిస్తున్నారు. రాశి ఖన్నా హీరోయిన్ గా నటిస్తోంది.