నాగార్జున హీరోయిన్ ను బెదిరిస్తున్నారట!

Ayesha Takia receives threatening messages, Husband Farhan Azmi seeks police help
Highlights

కొన్నేళ్లక్రితం నాగార్జున హీరోగా నటించిన 'సూపర్' సినిమాలో హీరోయిన్ గా కనిపించింది అయేషా టాకియా. ఈ సినిమా తరువాత ఆమె తెలుగులో పెద్దగా సినిమాలు చేయలేదు

కొన్నేళ్లక్రితం నాగార్జున హీరోగా నటించిన 'సూపర్' సినిమాలో హీరోయిన్ గా కనిపించింది అయేషా టాకియా. ఈ సినిమా తరువాత ఆమె తెలుగులో పెద్దగా సినిమాలు చేయలేదు. మొన్నామధ్య పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోయింది. అయితే గత కొద్దిరోజులుగా అయేషాను ఓ వ్యక్తి ఇబ్బందులకు గురి చేస్తున్నాడనే విషయం బయటకు వచ్చింది. అయేషాను తన కుటుంబాన్ని గుర్తు తెలియని వ్యక్తి వేధింపులకు గురి చేస్తున్నట్లు తన భర్త ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు.

చంపేస్తానని బెదిరింపులు రావడంతో అయేషా తన భర్త కలిసి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కానీ డీసీపీ దాహియా ఈ విషయాన్ని పట్టించుకోకపోవడంతో అయేషా భర్త ఫర్హాన్ అజ్మీ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాహియా ఈ కేసుని పట్టించుకోకపోవడం లేదని తమ ఫోన్ కాల్స్, మెసేజ్ లకు స్పందించడం లేదని.. తమ బ్యాంక్ ఖాతాలను మాత్రం బ్లాక్ చేశారని చెబుతున్నారు. డీసీపీ దాహియాకు చేసిన కంప్లైంట్, ఆయనకు పెట్టిన మెసేజ్ లను ఫర్హాన్ అజ్మీ ట్విట్టర్ లో షేర్ చేశారు. తమను బెదిరిస్తున్న వ్యక్తి నుండి కాపాడమని ప్రధాన మంత్రి మోదీ, విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ను కోరారు.

ట్విట్టర్ లో ఈ ఉదంతాన్ని గమనించిన ముంబై సీపీ దేవెన్ భారతి ఈ విషయాన్ని పరిష్కరిస్తామని బెదిరింపులకు పాల్పడుతున్న వ్యక్తిని అరెస్ట్ చేస్తామని మాటిచ్చారు. దీంతో అయేషా భర్త తనకు ముంబై పోలీసుల మీద నమ్మకం ఉందని అన్నారు. ఒక నటి కుటుంబానికి సమస్య వస్తేనే పట్టించుకోని పోలీసులు సాధారణ ప్రజలను కనీసం లెక్కలోకి తీసుకుంటారా అంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు. 

loader