Asianet News TeluguAsianet News Telugu

#Ayalaan:'ఆయలాన్' OTT డేట్ ఇచ్చేసారే, తెలుగు థియేటర్ రిలీజ్ లేనట్లేనా?

 ఈ సినిమా ఓటిటి రిలీజ్ డేట్ ప్రకటన వచ్చేసింది.  ఓటిటీ రిలీజ్ డేట్ ఇచ్చేసాక ఇంక డబ్బింగ్ చేస్తే తెలుగులో ఎవరు చూస్తారు...అంటే

Ayalaan OTT streaming partner and release details are out jsp
Author
First Published Jan 28, 2024, 8:42 AM IST

 తమిళ స్టార్ హీరో శివకార్తికేయన్ నటించిన లేటెస్ట్ మూవీ ఆయలాన్. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటించిన ఆయలాన్ మూవీ మొన్న శుక్రవారం రోజు తెలుగులోనూ విడుదల కావాల్సి ఉంది. అయితే అనుకోని విధంగా  ఆయాలన్ రిలీజ్ ఆగిపోయింది. మార్నింగ్ షోలు పడకపోవటం అందరికీ షాక్ ఇచ్చింది. మార్నింగ్ ,మాట్నీ షోలకు బుక్ చేసుకున్న వాళ్లకు రీ ఫండ్ మెసేజులు వస్తుండగా, డైరక్ట్ గా థియేటర్లకు వెళ్లిన వాళ్లకు షో లేదని చెప్పింది.  ఫైనాన్సియల్ క్లియరెన్స్ లు సమస్య కావటంతో సినిమా ఆగిందని తెలిసింది. అయితే ఆ కష్టాలు అక్కడితో ఆగేటట్లు లేదు. ఇప్పుడు ఈ సినిమా ఓటిటి రిలీజ్ డేట్ ప్రకటన వచ్చేసింది.  ఓటిటీ రిలీజ్ డేట్ ఇచ్చేసాక ఇంక డబ్బింగ్ చేస్తే తెలుగులో ఎవరు చూస్తారు...అంటే తెలుగు లో థియేటర్ రిలీజ్ లేనట్లేనా అనేది ఇప్పుడు ట్రేడ్ లో హాట్ టాపిక్ గా మారింది.

Ayalaan OTT streaming partner and release details are out jsp

ఇక ఓటిటి వివరాల్లోకి వెళితే...ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను Sunnxt కొనుక్కుంది. దాంతో  తమ లెక్కలు ప్రకారం థియేట్రికల్ విడుదలకు సరిగ్గా నాలుగు వారాల్లో ఓటిటి లో వచ్చేస్తుందని అఫీషియల్ గా ప్రకటన ఇచ్చింది. స్ట్రీమింగ్ తేదీని ఫిబ్రవరి 9 గా డిక్లేర్ చేస్తూ సోషల్ మీడియాలో ప్రకటన చేసింది. త్వరలో ఈ చిత్రం తన ప్లాట్‌ఫామ్‌పైకి రానుందని Sunnxt సోషల్ మీడియాలో అఫీషియల్ గా  తెలియజేసింది.  ఈ చిత్రాన్ని కెజెఆర్ స్టూడియోస్ పతాకంపై కోటపాడి జె. రాజేష్ నిర్మించారు. దీనికి ఆస్కార్ పురస్కార గ్రహీత, లెజెండరీ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించారు. అయలాన్ ఈ నెల 12న సంక్రాంతి కానుకగా తమిళనాడులో విడుదలైంది.

అయలాన్ అంటే ఏలియన్ అని అర్థం. ఏలియన్ ఓ ప్రధాన పాత్రలో దక్షిణాది భాషల్లో సినిమా రావడం ఇదే తొలిసారి కావటంతో ఈ ప్రాజెక్టుపై క్రేజ్ ఏర్పడింది. సైన్స్ ఫిక్షన్ యూనివర్స్ కాన్సెప్ట్ కావడంతో తెలుగు ప్రేక్షకులకు నచ్చే  అవకాసం ఉందని తెలుస్తోంది. వాస్తవానికి సంక్రాంతికి తెలుగులో కూడా విడుదల చేద్దామనుకున్నారు. కానీ, ఇక్కడే ముగ్గురు స్టార్ హీరోలు, ఒక యంగ్ హీరో పోటీ పడుతుంటడంతో అయలాన్‌తో పాటు ధనుష్ నటించిన కెప్టెన్ మిల్లర్ వెనక్కి వెళ్లిపోయాయి.  ధనుష్ కెప్టెన్ మిల్లర్ సినిమాను జనవరి 26న తెలుగులో విడుదల చేస్తుండగా.. శివ కార్తికేయన్ అయలాన్ సినిమా తెలుగు వెర్షన్‌ను జనవరి 26న రిలీజ్ చేయాలనున్నారు మేకర్స్. అయితే  ఇలా అర్ధాంతరంగా షాక్ ఇవ్వడం ఊహించనిది. ఈ రోజు ఏపీ తెలంగాణ అన్ని చోట్ల ఎక్కడా షోలు పడలేదు.

  తెలుగు రాష్ట్రాల్లో  గంగ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ విడుదల చేస్తోంది. తెలుగులో సూపర్ హిట్ అందుకున్న 'వరుణ్ డాక్టర్' సినిమా తర్వాత శివ కార్తికేయన్, కెజెఆర్ స్టూడియోస్, గంగ ఎంటర్‌టైన్‌మెంట్స్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా ఇది. అయితే, ఇప్పటికే అయలాన్ తమిళనాడులో బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. అయలాన్ మూవీలో శివ కార్తికేయన్‌, రకుల్ ప్రీత్ సింగ్‌తోపాటు ఇషా కొప్పికర్, 'సర్దార్ గబ్బర్ సింగ్' ఫేమ్ శరద్ కేల్కర్, సీనియర్ హీరోయిన్ భానుప్రియ, యోగిబాబు, కరుణాకరన్, బాల శరవణన్ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు.

Follow Us:
Download App:
  • android
  • ios