Asianet News TeluguAsianet News Telugu

వెయ్యేళ్ల క్రితం ఇండియాలో ఏం జరిగింది..పూర్తి సంస్కృతంలో సినిమా..

వెయ్యి ఏళ్ల క్రితం మన ఇండియాలో ఏం జరిగింది. అప్పుడు భార్యాభర్తల మధ్య రిలేషన్‌ ఎలా ఉండేది. అప్పటి నృత్య కళలు ఎలా ఉండేవనేది తెలియాలంటే `నభాంసి` చిత్రం చూడాలి` అంటున్నారు అవార్డు విన్నింగ్‌ డైరెక్టర్‌ రామ్‌ అల్లాడి.

award winning director ram alladi movie nabhamsi in samskritam   arj
Author
Hyderabad, First Published Mar 9, 2021, 12:20 PM IST

వెయ్యి ఏళ్ల క్రితం మన ఇండియాలో ఏం జరిగింది. అప్పుడు భార్యాభర్తల మధ్య రిలేషన్‌ ఎలా ఉండేది. అప్పటి నృత్య కళలు ఎలా ఉండేవనేది తెలియాలంటే `నభాంసి` చిత్రం చూడాలి` అంటున్నారు అవార్డు విన్నింగ్‌ డైరెక్టర్‌ రామ్‌ అల్లాడి. ఇండిపెండెంట్‌ ఫిల్మ్ మేకర్‌గా అమెరికాలో స్థిరపడిన భారతీయుడాయన. `చైసిల్డ్` అనేడాక్యుమెంటరీతో దర్శకుడిగా మారి అవార్డులందుకున్నారు. త తర్వాత `రాస్‌ మెటనోయా` అనే చిత్రాన్ని రూపొందించి 14 అంతర్జాతీయ అవార్డులందుకున్నారు. 

ఇప్పుడు మూడో ప్రయత్నంగా `నభాంసి` అనే పూర్తి సంస్కృత చిత్రాన్నిరూపొందిస్తున్నారు. ఏఆర్‌ ఐటీ వర్క్ సంస్థ నిర్మిస్తుంది. మహిళా దినోత్సవం సందర్భంగా ఇది సోమవారం షూటింగ్‌ ప్రారంభించుకుంది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ, `వెయ్యి సంవత్సరాల క్రితం మన దేశంలో జరిగిన కథగా ఈ సినిమాను రూపొందిస్తున్నాం. భార్యాభర్తల మధ్య జరిగే రొమాంటిక్ కథ ఇది. తన చిన్ననాటి అమూల్యమైన జ్ఞాపకాల్ని చేధిస్తూ ఉంటాడు భర్త. ఆ చేధనలో భార్యతో జరిగే రొమాన్స్ ఇది. చివరి వరకూ ఆ జ్ఞాపకాల్ని చేధించడం కోసమే తపిస్తుంటాడు. ఒక విధంగా అర్ధ నారీశ్వర తత్త్వం అని చెప్పవచ్చు.

సాహిత్యం, సంగీతం, నృత్యానికి సినిమాలో చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. కనుమరుగైపోయిన కొన్ని నృత్యాలను మా చిత్రంలో చూపించబోతున్నాం. అలాగే, ఆ కాలం నాటి సెట్స్, కాస్ట్యూమ్స్ సిద్ధం చేయించాం. సీజీ వర్క్స్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. 75 శాతం సినిమాను అమెరికాలో తీస్తాం. మరో 25 శాతం సినిమా చిత్రీకరణ మన దేశంలోని కొన్ని దేవాలయాల్లో చేస్తాం. ఇందులో మతాలు, తత్వాలకు సంబంధించిన చర్చకు తావు లేద`న్నారు. సినిమాలో ప్రధాన పాత్రలు అన్నిటినీ ప్రవాస భారతీయులు పోషించనున్నారని ఆయన తెలిపారు.

సంస్కృతంలో సినిమా తీయాలని అనుకోవడానికి గల కారణాన్ని రామ్ అల్లాడి వివరిస్తూ `ఆ కాలంలో అమూల్యమైన జీవితాన్ని కవితాత్మకంగా చెప్పడానికి సంస్కృతం బాగా ఉపయోగపడుతుంది. సంస్కృతంలో 'నభ' అంటే 'ఆకాశం' అని అర్థం. 'నభాంసి' అంటే `ఆకాశాలు` అని అర్థం. కన్నడ దర్శకుడు జీవీ అయ్యర్ సంస్కృతంలో తొలి సినిమా 'ఆదిశంకరాచార్య' చేశారు. తర్వాత సంస్కృతంలో 'భగవద్గీత' తెరకెక్కించారు. రెండూ ప్రజాదరణ పొందాయి. పురస్కారాలు అందుకున్నాయి. ఆ రెండూ చూసినప్పుడు సంస్కృతంలో సినిమా చేయాలని అనుకున్నాను. 2022లో సినిమాని విడుదల చేస్తామ`న్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios