మోహన్ బాబు వారసుడిగా మంచు విష్ణు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినట్టే... విష్ణు వారసుడిగా ఆయన చిన్నతనయుడు అవ్రామ్ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.
మెహన్ బాబు వారసత్వంలో రెండో తరం టాలీవుడ్ ఎంట్రీకి రెడీ అయ్యింది. మంచు వారి వారసులుగా విష్ణు,మనోజ్, లక్ష్మీ బాలనటులుగా తెలుగు పరిశ్రమలోకి వచ్చారు. అలాగే ప్రస్తుతం మంచు విష్ణు వారసత్వం కూడా తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. ఈక్రమంలోనే కన్నప్ప సినిమాతో మంచు విష్ణు తనయుడు అవ్రామ్ టాలీవుడ్ లో అడుగు పెట్టబోతున్నాడు. పాన్ ఇండియా సినిమాలో ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నాడు.
మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా కన్నప్ప. దాదాపు 150 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో కన్నప్ప సినిమాని సొంత బ్యానర్ లో తెరకెక్కిస్తున్నాడు మంచు విష్ణు. పాన్ ఇండియా రేంజ్ లో రూపొందుతున్న ఈ సినిమాలో ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్, శరత్ కుమార్, మధుబాల, బ్రహ్మానందం, మోహన్ బాబు.. ఇలా చాలా అన్ని భాషల నుంచి స్టార్స్ చాలా మంది నటిస్తున్నారు.
ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్లు, సాంగ్స్, ట్రైలర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాపై భారీగా అంచనాలు కూడా పెరిగిపోయాయి. ఈక్రమంలో ఈసినిమాకు సబంధించి సర్ ప్రైజ్ లు ఆగడంలేదు. ఈమధ్యనే రిలీజ్ చేసిన పాటలో మంచు విష్ణు ఇద్దరు ట్విన్ డాటర్స్ నటించి ఆశ్చర్యపరిచారు. ఇక ఈమూవీలో ఇంపార్టెంట్ పాత్ర ద్వారా మంచు విష్ణు తనయుడు ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.
కన్నప్ప సినిమా జూన్ 27న పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కాబోతుంది. ప్రస్తుతం మూవీ యూనిట్ ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు. అయితే ఈ సినిమాతో మంచు విష్ణు ఇద్దరు కూతుళ్లు, కొడుకు కూడా ఎంట్రీ ఇస్తున్నారు. ఇప్పటికే విష్ణు కూతుళ్లపై తెరకెక్కించిన సాంగ్ ని రిలీజ్ చేయగా, ఆపాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఇక తాజాగా మంచి విష్ణు తన కొడుకు అవ్రామ్ కు సబంధించిన వీడియోను షేర్ చేశారు. ఈ సినిమాలో మంచువారి వారసుడు జూనియర్ కన్నప్పగా కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. దీని కోసం ప్రత్యేకంగా తయారయిన మేకింగ్ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసిన మంచు విష్ణు, ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.
మంచు విష్ణు కొడుకు అవ్రామ్ కన్నప్ప మేకింగ్ వీడియో షేర్ చేసి.. నా లిటిల్ అవ్రామ్ కన్నప్పతో డెబ్యూట్ ఇస్తున్నాడు. అతను సెట్ కి రావడం, డైలాగ్స్ చెప్పడం నా లైఫ్ లో మోస్ట్ ఎమోషనల్ మూమెంట్స్. ఒక తండ్రిగా, మీరు ఒకప్పుడు కలలుగన్న ఆకాశం కిందే మీ బిడ్డ కూడా ఎదగడం చూడటానికి గొప్పగా ఉంటుంది అన్నారు.
అంతే కాదు ఇది కేవలం డెబ్యూట్ మాత్రమే కాదు ఇది నా లైఫ్ టైం మెమరీ. నాకు ఇచ్చినట్టే నా కొడుక్కి కూడా మీ అందరూ ఆశీస్సులు అందిస్తారని కోరుకుంటున్నాను. అవ్రామ్ జర్నీ కన్నప్పతో మొదలుకానుంది అంటూ ఎమోషనల్ గా రాసుకొచ్చారు. మంచువారి ఫ్యామిలీలో మూడో తరం వారసత్వం మొదలయ్యిందని చెప్పకనే చెప్పాడు విష్ణు. మరి కన్నప్పలో మంచు ఫ్యామిలీ సన్నివేశాలు ఎలా ఉండబోతున్నాయో చూడాలి.
