కామెడీ , రొమాన్స్, కన్నింగ్ ప్లే అన్ని రకాల ఆయుధాలు ప్రదర్శిస్తూ బిగ్ బాస్ కెమెరాలను  తన వైపు తిప్పుకుంటున్నాడు జబర్దస్త్ అవినాష్. దీనితో టైటిల్ కోసం పోటీపడే కంటెస్టెంట్స్ లో ఒకరిగా ఎదుగుతున్నాడు. తాజా ప్రోమోలో అవినాష్ హీరోయిన్ మోనాల్ తో నడిపిన రొమాన్స్ సరదా పంచింది. మోనాల్ స్వయంగా తన చేతులతో అవినాష్ కి తినిపిస్తుండగా,  అవినాష్ నా చేతులతో తింటే ఇంత రుచిగా ఉండదేమో అన్నాడు. 

దానికి రాజశేఖర్ మోనాల్  నాన్ వెజ్ చేయలేదు అన్నాడు. ఆ తరువాత మోనాల్ అవినాష్ నాతో కనెక్షన్ పెట్టుకోవాలి అనుకుంటున్నాడు అంది. లేదు 'ఏ' ఉన్నాడుగా అని అఖిల్ ని ఉద్దేశించి అన్నాడు. దానికి నాకు 'ఏ' వద్దని అంది. ఐతే ముక్కు, మోనాల్ బాగుంటుంది అన్నాడు అవినాష్. దానికి రాజశేఖర్ కూడా ముక్కు మోనాల్ అవును .. ఎమ్ ఎమ్ అన్నాడు.  మోనాల్ తనకు చాలా ముద్దు వస్తుందన్న ఎక్స్ప్రెషన్ ని అవినాష్ ఇవ్వగా, ఇవ్వన్నీ చూడడం నా ఖర్మ అని రాజశేఖర్ అనగానే అందరూ నవ్వారు. 

ఇక హౌస్ లోకి ఐశ్వర్యను పంపమని నోయల్ అడుగగా, అవును బిగ్ బాస్ వీళ్ళ మొహాలు చూసి చూసి బోర్ కొట్టింది, ఎవరినైనా పంపండి అన్నట్లు అవినాష్ అన్నాడు. బిగ్ బాస్ తాజా ప్రోమోలో ఈ ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయి. తాజా ప్రోమో నేటి ఎపిసోడ్ పై ఆసక్తి పెంచేసింది. గత ఎపిసోడ్ లో రెడ్ మరియు బ్లూ టీమ్స్ మధ్య పోరు ఆసక్తిగా సాగింది.