బిగ్‌బాస్‌ నాల్గో సీజన్‌ 47 రోజు అవినాష్‌ చాలా ఓవర్‌ యాక్షన్‌ చేశాడు. ఈ  వారం హౌజ్‌లో కెప్టెన్‌ కావడంతో ప్రతి విషయంలోనూ రెచ్చిపోతున్నాడు. ఇంటిసభ్యులకు బిగ్‌బాస్‌ సినిమా తీయాలనే టాస్క్ పెట్టాడు. `బిగ్‌బాస్‌ బ్లాక్‌బస్టర్‌` సినిమా తీసి దసరాకి ఆడియెన్స్ కి వినోదం పంచాలని చెప్పారు. అభిజిత్‌ డైరెక్షన్‌, అవినాష్‌ స్క్రిప్ట్ రైటర్‌గా, నోయల్‌ డీఓపీగా  పనిచేయగా, అమ్మ రాజశేఖర్‌ కొరియోగ్రాఫర్‌గా, హారిక, సోహైల్‌ ఐటెమ్‌ సాంగ్‌ రాజాలుగా, అఖిల్‌, మోనాల్ హీరోహీరోయిన్లుగా, మెహబూబ్‌ విలన్‌గా నటించారు. 

ఓ వైపు హౌజ్‌లో కెప్టెన్‌గా ఉంటూనే, మరోవైపు స్క్రిప్ట్ రైటర్‌గా, నటుడిగా తనలోని విభిన్న కోణాలను ఆవిష్కరించాడు. అయితే స్క్రిప్ట్ రైటర్‌గానూ తన హవా చూపించాడు. దర్శకుడు అభిజిత్‌పై డామినేషన్‌ ప్రదర్శిస్తూ రెచ్చిపోయాడు. డైలాగులు ఇచ్చినప్పుడు తీసుకోవాలని ఓసారి, ఆ డైలాగు ఇంకారాయలేదని, ఫైట్‌ సీన్‌ తీయి దానికి డైలాగులు అవసరం లేదని చెప్పాడు. 

మరోవైపు నటుడుగా పల్లెటూరి బావ పాత్రలో ఒదిగిపోయాడు. అరియానాని నోయల్‌ ఏడిపిస్తుండగా, ఆమెని అవినాష్‌ కాపాడాడు. అండగా నిలిచి సేవ్‌ చేశాడు. ఆ తర్వాత అరియానా డైలాగులు సరిగా చెప్పడం లేదని ఫైర్‌ అయ్యాడు. అంతేకాదు నామినేషన్‌ టైమ్‌ ఒక్కొక్కరి సంగతి చెబుతానని బెదిరింపులకు దిగాడు. మొత్తంగా ఈ వారం తన హవా సాగిస్తున్నాడు అవినాష్‌.