బిగ్ బాస్ సీజన్ 4 చివరి దశకు చేరుకుంది. హౌస్ లో ఉన్న ఏడుగురు సభ్యులలో ఇద్దరు ఎలిమినేట్ కానున్నారు. టికెట్ టు ఫినాలే మెడల్ గెలుచున్న అఖిల్ నేరుగా ఫైనల్ కి చేరాడు. అతను ఎలిమినేషన్స్ లో ఉన్నప్పటికి, నిన్న ఎపిసోడ్ లో సేవ్ అయిన కారణంగా అఖిల్ టికెట్ టు ఫినాలే మెడల్ గెలిచారు. ఫైనల్ కి చేరిన మొదటి కంటెస్టెంట్ గా అఖిల్ ని బిగ్ బాస్ ప్రకటించారు. నాగార్జున సైతం అఖిల్ ని అభినందించారు. 

ఇంకా నలుగురు ఇంటి సభ్యులు ఎలిమినేషన్ లో ఉన్నారు. అభిజిత్, అవినాష్ , హారిక మరియు మోనాల్ ఎలిమినేషన్స్ లిస్ట్ లో ఉన్నారు. ఈ నలుగురు కంటెస్టెంట్స్ లో ఇద్దరు డేంజర్ జోన్ లో ఉన్నట్లు వార్తలు అందుతున్నాయి. మోనాల్ లేదా అవినాష్ ఈ వారం ఇంటిని వీడనున్నారని అందరూ అనుకుంటున్నారు. 

అభిజిత్, హారిక స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ గా సేవ్ కావడం ఖాయం అంటున్నారు. 
ఈ వారం మోనాల్ హౌస్ నుండి ఎలిమినేట్ కావడం ఖాయం అన్న మాట వినిపిస్తున్నప్పటికీ, అవినాష్ కూడా ఎలిమినేట్ అయ్యే అవకాశం కలదు, అనేది తాజా సమాచారం. ఈ వారం మొత్తం అవినాష్ ని బిగ్ బాస్ కొంచెం బ్యాడ్ గా ప్రొజెక్ట్ చేశాడు. అరియనా పై కోపడడం, టాస్క్ ల నుండి నేను చేయను అని నిష్క్రమించడం వంటి సీన్స్ చూపించారు. 

అవినాష్ ని హౌస్ నుండి ఎలిమినేట్ చేయడాకిని బిగ్ బాస్ ఈ విధంగా ప్లాన్ చేశాడన్న మాట వినిపిస్తుంది. మొత్తంగా ఈ వారం అయితే మోనాల్ లేదా అవినాష్ ఇద్దరిలో ఒకరు ఎలిమినేట్ కానున్నారట. మరో కొన్ని గంటలలో దీనిపై స్పష్టత రానుంది.