బిగ్ బాస్ సీజన్ 4 సక్సెస్ ఫుల్ గా 13 వారాలు పూర్తి చేసుకుంది. ఇక నేడు ఆదివారం కావడంతో బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున వేదిక పైకి వచ్చేశాడు. క్రేజీ గేమ్స్ తో ఇంటి సభ్యులకు, ప్రేక్షకులకు ఆహ్లాదం పంచె ప్రయత్నం చేశారు. హౌస్ లో ఉన్న ఏడుగురు కంటెస్టెంట్స్ ఫన్నీ గేమ్స్ లో పాల్గొన్నారు. ఈ గేమ్స్ లో నాగార్జున ఇంటి సభ్యులను ఆటపట్టిస్తూ నవ్వులు పూయించారు. ఇక ఈ గేమ్స్ లో మోనాల్ అవినాష్ కి పువ్వు ఇవ్వగా, ఫస్ట్ టైం ఒక పువ్వు మరో పువ్వు ఇచ్చింది అన్నాడు. దానికి నాగార్జున మరో పువ్వుకే ఇచ్చిందిలే అని పంచ్ వేశాడు. దానికి అవినాష్ నోరెళ్లబెట్టాడు. 

అలాగే నాగార్జున మరో గేమ్ లో మోనాల్ నీవు అవినాష్ ని ఎన్ని సార్లు ముద్దు పెట్టుకున్నావ్ అని అడిగాడు. దానికి అవినాష్ అందుకోని చాలా సార్లు ముద్దుపెట్టింది అన్నాడు. అనుభవించిన నాకు తెలుసు, చాలా సార్లు ముద్దు పెట్టింది అన్నాడు. అవినాష్ మాటలు అందుకుంటూ సోహైల్, అన్నయ్య కదా అందుకే ముద్దు పెట్టింది అన్నాడు. దీనికి అవినాష్ రియాక్ట్ అయ్యాడు, ఏందీ అన్నయ్య... మొన్న కూడా ఇలాగే అన్నయ్య అని పిలిపించారు. చచ్చిపోవాలని అనిపించింది అని అన్నాడు. దీనికి ఇంటి సభ్యులు బిగ్గరగా నవ్వారు.

మొత్తంగా నేటి ఎపిసోడ్ నాగార్జున చాలా ఆహ్లాదంగా నడిపించారు అనిపిస్తుంది. ఎంత సరదాగా నడిపినా నేడు ఇంటి నుండి ఒకరు ఎలిమినేట్ కానున్నారు. ఎలిమినేషన్స్ కి నామినేట్ అయిన అఖిల్ నిన్న సేవ్ కాగా, అభిజిత్, అవినాష్, మోనాల్ మరియు హారిక లిస్ట్ లో ఉన్నారు. ఈ నలుగురిలో ఒకరు నేడు ఎలిమినేట్ కానున్నాడు. అవినాష్ లేదా మోనాల్ ఎలిమినేటయ్యే అవకాశం కలదని వార్తలు బయటికి వస్తున్నాయి.