`చిన్నారి పెళ్లి కూతురు` ఫేమ్‌ అవికా గోర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.  ప్రియుడు మిలింద్‌ చంద్వానీ తన జీవితంలోకి వచ్చాక తన లైఫ్‌ చాలా మారిపోయిందని తెలిపింది. 

తన బాడీ అంటే తనకు అసహ్యమని చెప్పి ఇటీవల షాకిచ్చింది `చిన్నారి పెళ్లి కూతురు` ఫేమ్‌ అవికా గోర్‌(Avika Gor). తన బాడీని అస్సలు పట్టించుకోలేదని, కనీసం అద్దంలో కూడా చూసుకోనని తెలిపి ఆశ్చర్యానికి గురి చేసింది. తప్పు తెలుసుకున్న అవికా గోర్‌ ఆ తర్వాత బాడీ ఫిట్నెస్‌పై దృష్టి పెట్టి ఇప్పుడు నాజుక్కాగా మారింది. అదే సమయంలో లవ్ లోనూ పడింది. ఆమె మిలింద్‌ చంద్వానీ అనే సామాజిక వేత్త ప్రేమలో మునిగి తేలుతుంది. 

అయితే మిలింద్‌ తన జీవితంలోకి వచ్చాకే తనలో చాలా మార్పు వచ్చిందని చెబుతుంది Avika Gor. మిలింద్‌తో రిలేషన్‌షిప్‌ స్టార్ట్ చేసిన కొంత కాలం తర్వాత తన యాటిట్యూడ్‌లో చాలా మార్పు వచ్చిందని చెప్పింది. అంతేకాదు తన జీవితంలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయని చెప్పింది. తాజాగా ఓమీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అవికా ఇలాంటి ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఇప్పుడు తనపై తనకు నమ్మకం పెరిగిందని చెప్పింది అవికా గోర్‌. 

మిలింద్‌ చాంద్వానీతో రిలేషన్‌షిప్‌ ప్రారంభించిన కొంత కాలానికే తనలో ఆత్మవిశ్వాసం పెరిగిందని చెప్పింది. తన శక్తి సామర్థ్యాలను పూర్తి స్థాయిలో ఉపయోగించుకునేలా ఎన్నో విషయాలను మిలింద్‌ చెప్పాడని తెలిపింది అవికా. మిలింద్‌ తన జీవితంలోకి ప్రవేశించిన అనంతరమే మంచి పాత్రలు ఎంపిక చేసుకుంటున్నానని వెల్లడించింది. తన కెరీర్‌లో చాలా మార్పు వచ్చింది. యాటిట్యూడ్‌ కూడా పూర్తిగా మారిందని వెల్లడించింది అవికా గోర్‌. 

నటుడు, ఎన్జీవో నిర్వహకుడు మిలింద్‌ని ప్రేమిస్తున్నట్టు 2020లో అవికాగోర్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా వెల్లడించింది. `మనల్ని నమ్మే, స్ఫూర్తి నింపే, ఉన్నత శిఖరాలను అధిరోహించేందుకు సహాయపడే, జాగ్రత్తగా చూసుకునే భాగస్వామి మన అందరికి కావాలి` అని అవికా తెలిపింది. ఇదిలా ఉంటే `చిన్నారి పెళ్లి కూతురు` సిరీయల్‌తో అటు నార్త్ లో, ఇటు సౌత్‌లో మంచి గుర్తింపు పొందింది అవికా గోర్. `ఉయ్యాల జంపాల` సినిమాతో తెలుగులోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి ఆకట్టుకుంది. ఆ తర్వాత `సినిమా చూపిస్త మావా`, `ఎక్కడికి పోతావు చిన్నవాడా` వంటి సినిమాల్లో నటించి టాలీవుడ్ ప్రేక్షకులకు చేరువైంది. ప్రస్తుతం ఆమె `10th క్లాస్ డైరీస్` సినిమాలో నటించింది. ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. 

View post on Instagram