'ఎవెంజర్స్: ది ఎండ్ గేమ్' సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగా ఎదురుచూశారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మూడు రోజుల్లో వేల కోట్ల కలెక్షన్స్ రాబట్టింది.

ఇప్పటివరకు ఈ సినిమా 1.2 బిలియన్ డాలర్లు కొల్లగొట్టింది. అంటే ఇండియన్ కరెన్సీలో రూ.8,384 కోట్లు. కేవలం అమెరికా, కెనడాలో గురువారం రాత్రి నుండి ఆదివారం వరకు 350 మిలియన్ డాలర్లు రాబట్టినట్లు అంచనా వేస్తున్నారు.

చైనా, ఫ్రాన్స్, బ్రెజిల్ ఇలా చాలా దేశాల్లో ఈ సినిమా చరిత్ర సృష్టించింది. భారత్ లో ఈ సినిమాను 2845 థియేటర్లలో విడుదల చేయగా.. మూడు రోజుల్లో రూ.157 కోట్లు రాబట్టింది. ఇండియాలో ఒక ఇంగ్లీష్ సినిమాకు ఈ రేంజ్ లో కలెక్షన్స్ రావడం ఇదే తొలిసారి. 

ఆంటోనీ రుస్సో, జో రుస్సో డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో రాబర్ట్‌ డౌనీ జూనియర్,క్రిస్‌ హెమ్స్‌వర్త్, మార్క్‌ రఫెలో, క్రిస్‌ ఇవాన్స్, స్కార్లెట్‌ జొహాన్సన్‌ వంటి వారు ముఖ్య పాత్రలు పోషించారు.