ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన 'ఎవెంజర్స్: ది ఎండ్ గేమ్' సినిమా ఎట్టకేలకు థియేటర్లలోకి వచ్చింది. వరల్డ్ వైడ్ ఈ సినిమా ఓపెనింగ్స్ లో రికార్డ్స్ నెలకొల్పింది. శుక్రవారం విడుదలయిన ఈ సినిమా కొన్ని ఆసియా దేశాల్లో రెండు రోజుల ముందుగానే రిలీజ్ చేశారు.

చైనాలో ఈ సినిమాని భారీ ఎత్తున రిలీజ్ చేశారు. తొలిరోజు అక్కడ సాధించిన వసూళ్లు ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. దాదాపు  రూ.750 కోట్లు వసూళ్లు సాధించి సంచలనం సృష్టించింది. ఇప్పటికవరకు చైనాలో ఏ సినిమా కూడా ఈ రేంజ్ లో వసూళ్లు రాబట్టలేదు.

అక్కడ దేశవ్యాప్తంగా లక్షకు పైగా థియేటర్లు ఉన్నాయి. 'ఎవెంజర్స్' సినిమాను సగం థియేటర్లలోనే రిలీజ్ చేశారు. అయినప్పటికీ ఈ సినిమా రూ.750 కోట్లు సాధించడంతో డిస్ట్రిబ్యూటర్లు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

మొదటిరోజే ఈ రేంజ్ లో వసూలు చేసిందంటే లాంగ్ రన్ ఇంకెన్ని రికార్డులు సృష్టిస్తుందో.. ఇండియాలో కూడా ఈ సినిమాకి క్రేజ్ మాములుగా లేదు. ఇక్కడ కూడా మంచి ఓపెనింగ్స్ వస్తాయని ఆశిస్తున్నారు. ఇండియాలో ఎలా లేదన్నా.. రూ.500 కోట్లు వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు.