అవేంజర్స్: ది ఇన్ఫినిటీ వార్ సినిమా రివ్యూ.. ఇదోక అద్భుతం

Avengers infinity war movie review
Highlights

అవేంజర్స్: ది ఇన్ఫినిటీ వార్ సినిమా రిప్యూ.. ఇదోక అద్భుతం

హాలీవుడ్‌లో సూపర్ హీరోస్ నేపథ్యంలో వచ్చిన చిత్రాలకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఈ సినిమాల్లోని సూపర్ హీరోలందరూ కలిసి ప్రపంచాన్నినాశనం చేయడానికి ప్రయత్నిస్తోన్న బలమైన శత్రువుతో పోరాడితే ఎలా ఉంటుందనేదే ఈ 'అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్'. ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాల మధ్య విడుదలవుతోన్న ఈ చిత్రం.. ఇండియాలోనూ కనీవిని ఎరగని స్థాయిలో 2 వేల థియేటర్లలో పైగా రిలీజ్ అవుతోంది. మార్వెల్‌ స్టూడియోస్‌ చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కి ఈ సినిమా ఎలా ఉందో రివ్యూ లోకి వెళ్లి చూద్దాం. 

కథ: 

అమెరికా సివిల్ వార్ సమయంలో ఎవరికి వారుగా విడిపోయిన అవెంజర్స్ అందరూ కలిసి ప్రపంచాన్ని మొత్తం తన అదుపులో పెట్టుకోవాలని చూసే థానోస్‌కు ఎదురు తిరుగుతారు. ప్రపంచాన్ని తన గుప్పిట్లో పెట్టుకోవాలంటే భూమి మీదున్న ఆరు విలువైన ఇన్ఫినిటీ స్టోన్స్‌ను తన వశం చేసుకునే ప్రయత్నంలో ఉన్న థానోస్‌ను అవెంజర్స్ అడ్డుకుంటారు. అతి శక్తివంతుడైన థానోస్‌ను తట్టుకొని అవెంజర్స్ ఎలా నిలబడిగలిగారు..? అనేదే ఈ చిత్ర కథాంశం .

విశ్లేషణ: 
సూపర్ హీరోల సినిమాలంటేనే సాహసాలు, విన్యాసాలు. అలాంటిది సూపర్ హీరోలందరూ ఒకే శక్తిగా నిలబడి విలన్‌‌ను ఎదుర్కోవడానికి చేసే ప్రయత్నంలో యాక్షన్ సన్నివేశాలతో అదరగొట్టారు. కెప్టెన్ అమెరికా వర్గం, బ్లాక్ పాంథర్ వర్గం కలిసి థానోస్ వర్గంపై దాడి చేసే సన్నివేశాలు ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేస్తాయి. అవెంజర్స్‌లో హల్క్, థోర్, స్పైడర్ మ్యాన్, ఐరన్ మ్యాన్ ఇలా ప్రతి ఒక్క సూపర్ హీరో తెరపై కనిపించి ప్రేక్షకులను రంజింపజేస్తారు. 

సినియాలో యాక్షన్ ఎపిసోడ్స్ చాలా కీలకం. ఇందులో ప్రీ క్లైమాక్స్ మరియు క్లైమాక్స్‌లో వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్ సినిమా మొత్తానికి హైలైట్‌గా నిలిచింది. థానోస్ పాత్రను డిజైన్ చేసిన తీరు, దాని కోసం వాడిన మేకప్ పర్ఫెక్ట్‌గా ఉంది. థోర్ తన ఆయుధాన్ని తిరిగి తయారు చేసుకొని దాడికి దిగే సన్నివేశాలు ప్రేక్షకులతో ధ్రిల్ కు గురిచేస్తాయి.  బ్లాక్ పాంథర్ వర్గాన్ని తెరపై పరిచయం చేసే సీన్స్ మరో హైలైట్. 'గమొరా' అనే పాత్ర ద్వారా కథకు కొన్ని ఎమోషన్స్ జోడించి కథలో లీనమయ్యేలా చేశారు. 

సినిమాను ముగించిన తీరు సీక్వెల్ పార్ట్‌పై ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. దాదాపు రూ.4 వేల కోట్ల రూపాయలతో తెరకెక్కించిన ఈ సినిమాలో సాంకేతికంగా ఎలాంటి లోపాలు కనిపించవు. కెమెరా వర్క్, నేపథ్య సంగీతం, వీఎఫ్ఎక్స్, ఇలా ప్రతిదీ చక్కగా కుదిరింది. కామిక్స్ ఇష్టపడే ప్రేక్షకులకు చక్కటి వేసవి కానుక 'అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్'. ఈ సినిమాకి సీక్వెల్ 2019 లో రానుంది.

ఈ సినిమాకి ఏషియానెట్ ఇస్తున్న రేటింగ్ :  4/5

loader