మహేష్ బాబు సంస్కారానికి ఫిదా అయిన హీరో ఎవరో తెలుసా? సూపర్ స్టార్ అంతలా ఏం చేశారు?
Mahesh Babu : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..చాలా కామ్ గా ఉంటారు. కానీ ఎవరికి ఎక్కడ ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలో తెలిసిన వ్యక్తి మహేష్ బాబు. సూపర్ స్టార్ ఓ సందర్భంలో చేసిన కామెంట్స్ కు.. టాలీవుడ్ హీరో ఫిదా అయిపోయాడు.

సూపర్ స్టార్ వారసుడిగా..
బాలనటుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు.. అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నాడు. కృష్ణ వారసుడిగా ఆయన పేరును చిన్నతనంలోనే నిలబెట్టాడు మహేష్. ఇక హీరోగా మారిన తరువాత కెరీర్ బిగినింగ్ లో కొన్ని ఇబ్బందులు అనుభవించినా..? ఆతరువాత కాలంలో మంచి మంచి సినిమాలతో అభిమానులను ఆకట్టుకున్నాడు. కృష్ణ లెగసీని కాపాడుకుంటూ.. తనకంటూ సొంత ఫ్యాన్ ఫాలోయింగ్ ను కూడా సాధించాడు మహేష్ బాబు. కృష్ణ ఏడాదికి 20 సినిమాలకు పైగా చేసిన రికార్డు ఉంటే.. మహేష్ బాబు మాత్రం ఏడాదికి ఒక్క సినిమా మాత్రమే చేస్తూ.. ఆ సినిమాతో అభిమానులకు కావల్సినంత బూస్ట్ ఇస్తున్నాడు.
మహేష్ బాబు మంచితనం..
మంచితనంలో సూపర్ స్టార్ కృష్ణను మించిపోయాడు మహేష్ బాబు. ఎవరికి ఎక్కడ ఎలా గౌరవం ఇవ్వాలో ఆయనకు బాగా తెలుసు. తనకంటే చిన్నవారిని, తన తోటి నటీనటులను మహేష్ బాబు బాగా గౌరవిస్తాడు. ఎవరితో ఎక్కువగా మాట్లాడని ఆయన.. చాలా వరకూ కామ్ గా తన పని తాను చేసుకుపోతాడు. అయితే మహేష్ బాబు నటించిన సూపర్ హిట్ సినిమాల్లో మహర్షి కూడా ఒకటి. వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేసిన ఈమూవీలో మహేష్ బాబు స్నేహితుడిగా టాలీవుడ్ కామెడీ హీరో అల్లరి నరేష్ నటించారు. ఈసినిమాలో ఆయన నటన, బిహేవియర్ మహేష్ బాబుకు బాగా నచ్చింది. ఈ విషయాన్ని చాలా సందర్భాల్లో ఆయన వెల్లడించారు.
అల్లరి నరేష్ పై మహేష్ బాబు ప్రశంసలు
అల్లరి నరేష్ మహర్షి సినిమాలో నటించడంపై మహేష్ బాబు ఓసందర్భంలో స్పందించారు. మహేష్ మాట్లాడుతూ... " మహర్షి సినిమా విజయంతో నరేష్ పాత్ర చాలా ఉంది. ఆయన అసలు ఈ సినిమా ఒప్పుకోవడం చాకు చాలాసంతోషం అనిపించింది. డైరెక్టర్ వంశీ ఈ పాత్ర గురించి చెప్పినప్పుడు... నరేష్ గారు ఒప్పుకుంటారా.. ముందు ఆయన్ను అడగండి అని అన్నాను. కానీ కథ విన్న వెంటనే ఆయన ఈ క్యారెక్టర్ చేయడానికి ఒకే చెప్పడం నిజంగా సంతోషం. అంతే డెడికేషన్ తో ఈ సినిమాలో నటించారు నరేష్. థ్యాంక్యూ వెరీ మచ్ సార్'' అంటూ అల్లరి నరేష్ ను ఉద్దేశించి మహేష్ బాబు మాట్లాడిన మాటలు.. వైరల్ అయ్యాయి. అంతే కాదు మహేష్ బాబు చేసిన ఈ కామెంట్స్ తో నరేష్ కుడా దిల్ ఖుష్ అయ్యారు. ఆయన అంత వినయంగా కృతజ్ఞతలు చెప్పడంతో నరేష్ చాలా సంతోషించారు. ఇవే కాదు గతంలో కూడా నరేష్ గురించి సూపర్ స్టార్ కొన్ని కామెంట్స్ చేశారు. షూటింగ్ లో ఆయన ఎలా ఉంటారో మహేష్ బాబు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. నరేష్ గారు ఆయన పని ఆయన చేసుకుంటారు.. షాట్ అయిపోగానే పక్కన వెళ్ళి కామ్ గా కూర్చుంటారు... చాలా కూల్ గా ఉంటారు అని మహేష్ అన్నారు.
ఎంతో మంది జీవితం కాపాడిన మహేష్..
మహేష్ బాబు సినిమాల ద్వారా, యాడ్స్ ద్వారా కోట్లు సంపాదిస్తున్నారు. అయితే ఆ డబ్బులో కొంత బాగం మహేష్ సమాజ సేవ కోసం ఉపయోగిస్తున్నారు. ఇప్పటికే దాదాపు 1300 మంది చిన్నారులకు గుండె ఆపరేషన్లు చేయించి, వారి ప్రాణాలు కాపాడాడు మహేష్. అయితే వెయ్యిమంది పిల్లలకు ఆపరేషన్ కంప్లీట్ అయ్యే వరకూ ఈ విషయం బయటకు తెలియలేదు. తాను చేస్తున్న సాయన్ని కూడా ఎవరికి చెప్పకుండా మంచి మనసుతో కోట్లు ఖర్చు పెడుతున్నాడు సూపర్ స్టార్. అనవసరం ఆర్భాటాలుకు వెళ్ళకుండా.. కామ్ గా తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నాడు.

