హాలీవుడ్ బారి సినిమాలకు ఖర్చు చేసే బడ్జెట్ ఒక ఎత్తైతే.. దానికి వచ్చే కలెక్షన్స్ మరొక ఎత్తు. ప్రస్తుతం అందరి చూపు ఎవెంజర్స్: ది ఎండ్ గేమ్ పైనే ఉంది. ఈ సినిమా మరికొన్ని రోజుల్లో వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతోంది. 26వ తేదీ ఇండియాలో సినిమాను భారీగా రిలీజ్ చేస్తున్నారు. 

అయితే సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయిన కొన్ని నిమిషాలకే జనాలు ఎగబడి కొనుక్కున్నారు. లాస్ట్ సిరీస్ కావడంతో ఎండ్ గేమ్ పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇకపోతే సినిమా ఈజీగా ప్రపంచంలో ఉన్న నెంబర్ వన్ రికార్డును బ్రేక్ చేసేలా ఉంది. జేమ్స్ కెమరూన్ అవతార్ టోటల్ గా 2.7 బిలియన్ డాలర్లు (రూ.18,800 కోట్ల) రాబట్టింది.

అయితే ఈ రికార్డును ఎండ్ గేమ్ బ్రేక్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కనిపిస్తోన్న హడావుడి ప్రకారం సినిమాకు ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా కూడా 3 బిలియన్ డాలర్స్(20 వేల కోట్లకు పైగా) ను అందుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ లెక్కలపై కాస్త అనుమానం ఉన్నప్పటికీ బజ్ చూస్తుంటే సినిమా ఖచ్చితంగా ఎదో వండర్ క్రియేట్ చేసేలా ఉందని అనిపిస్తోంది.