Asianet News TeluguAsianet News Telugu

ఎస్ఎస్ రాజమౌళికి హాలీవుడ్ దిగ్గజ దర్శకుడి ఆఫర్? ‘ఆర్ఆర్ఆర్’పై జేమ్స్ కామెరూన్ ప్రశంసల వర్షం!

‘ఆర్ఆర్ఆర్’పై హాలీవుడ్ ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుతూనే ఉన్నాయి. ‘అవతార్’ దర్శకుడు జేమ్స్ కామెరూన్ ‘ఆర్ఆర్ఆర్’ గురించి రాజమౌళితో మాట్లాడిన సంబాషణను టీం తాజాగా పంచుకుంది.  
 

Avatar director James Cameron talks about RRR movie with Rajamouli!
Author
First Published Jan 21, 2023, 1:08 PM IST

హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు.. టైటానిక్, అవతార్ లాంటి అద్భుతాల సృష్టి కర్త  జేమ్స్ కామెరూన్ (James Cameron) ‘ఆర్ఆర్ఆర్’పై తనదైన శైలిలో రివ్యూ ఇచ్చారు. రీసెంట్ గా RRR టీం గోల్డెన్ గ్లోబ్ అవార్డుల ప్రదానోత్సవంలో పాల్గొన్న విషయం తెలిసిందే. దీంతోపాటు అమెరికాలో జరిగిన ఓ గ్లోబల్ ఈవెంట్ లోనూ సందడి చేశారు. ఈ సందర్భంగా హాలీవుడ్ దిగ్గజ దర్శకులను రాజమౌళి మర్యాదపూర్వకంగా కలిసి వారి నుంచి ప్రశంసలు దక్కించుకున్నారు.

‘అవతార్’ దర్శకుడు జేమ్స్ కామెరూన్ ను రాజమౌళి కలిసి విషయం తెలిసిందే. ఆయన్న కలవడం పట్ల జక్కన్న సంతోషం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ‘ఆర్ఆర్ఆర్’పై జేమ్స్ కామెరూన్ దాదాపు పది నిమిషాల పాటు మాట్లాడరు. అందులోని కొంత భాగానికి సంబంధించిన సంభాషణ వీడియోను ఆర్ఆర్ఆర్ టీం అభిమానులతో పంచుకుంది.వీడియోలో జేమ్స్ కామెరూన్ ఆర్ఆర్ఆర్ లో తను నచ్చిన కొన్ని అంశాలను జక్కనతో షేర్ చేసుకున్నారు. 

తొలుత జక్కన్న జేమ్స్ కామెరూన్ ను పలుకరిస్తూ.. ఆయన సినిమాలన్నీ చూశానని, చాలా స్ఫూర్తినిచ్చాయని తెలిపారు. ఇక ‘ఆర్ఆర్ఆర్’పై కామెరూన్ మాట్లాడుతూ.. సినిమాలోని క్యారెక్టర్స్ తను బాగా నచ్చాయని చెప్పారు. సినిమా చూస్తున్నప్పు ఓరకమైన అనుభూతిని కలిగించాయన్నారు. వాటర్, ఫైర్ గా స్టోరీ సెటప్ చేయడం, వాటి వెనకాల ఉన్న బ్యాక్ స్టోరీని ఒకదాని తర్వాత మరొకటి రివీల్ చేయడం బాగుందన్నారు. అలాగే సన్నివేశానికి సందర్భానుసారంగా సంగీతం సాగిందన్నారు. చిత్రంలోని ట్విస్టులు, టర్న్స్ తనకు అద్భుతమనిపించాయని అన్నారు. అందుకే సినిమాను రెండు సార్లు చూశారని, తాను చూశానని జేమ్స్ సతీమణి తెలిపింది.

ఇక సినిమాను 320 రోజుల్లోనే షూట్ చేశామని తెలుసుకొని అభినందించారు. బెస్ట్ బీజీఎం అందించిన ఎంఎం కీరవాణిని ప్రత్యేకంగా ప్రశంసింశారు. ఇక హాలీవుడ్ లో సినిమా తీయాలనుకుంటే.. మనం దాని గురించి మాట్లాడుదామని జక్కన్నతో అనడం విశేషం. ఇక రీసెంట్ గా ‘ఆర్ఆర్ఆర్’ గోల్డెన్ గ్లోబ్స్ అవార్డ్, సీసీఏ నుంచి రెండు అవార్డులను దక్కించుకుంది. ప్రస్తుతం ‘ఆస్కార్స్’ బరిలో దూసుకుపోతోంది. ఇప్పటికే ఒరిజినల్ స్కోర్ విభాగంలో నాటు నాటు (Naatu Naatu) సాంగ్ షార్ట్ లిస్ట్ అయిన విషయం తెలిసిందే. జనవరి 24న నామినేటెడ్ జాబితా రానుంది. ఇందులో ఆర్ఆర్ఆర్ ఉంటుంని ఆశిస్తున్నారు. ఇక మార్చిలో అవార్డుల ప్రదానోత్సవం గ్రాండ్ గా జరగనుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios