అవతార్ సినిమా అంటే తెలియని ప్రేక్షకుడు ఉండడు. సరికొత్త ప్రపంచాన్ని చూపించి బాక్స్ ఆఫీస్ హిట్ గా నిలిచిన  ఆ కథకు ప్రస్తుతం మూడు పార్ట్ లు తెరకెక్కుతున్నాయి. నెక్స్ట్ అవతార్ 2 కోసం దర్శకుడు జేమ్స్ కేమెరూన్ చాలా కష్టపడుతున్నాడు. రీసెంట్ గా షూటింగ్ కి సంబందించిన ఒక లొకేషన్ పిక్ ని చిత్ర నిర్మాత సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 

ఓ వైపు ఎగసిపడుతున్న అగ్ని జ్వాలలు -  మరోవైపు సముద్రపు అలలు.. ఆ కాంబినేషన్ లో ఒక సీన్ ను 3డి కెమెరాతో షూట్ చేస్తున్నారు. సాధారణంగా కెమెరామెన్ షూట్ చేస్తుంటారు. కానీ తనకు ఇష్టమైన సీన్ ని జేమ్స్ కేమెరూన్ ఇష్టంగా షూట్ చేసుకున్నాడు. అగ్ని - అలలు - 3డి తనకు ఇష్టమైన కాంబినేషన్ అని జేమ్స్ కేమెరూన్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. 

ఇక అవతార్ 2 షూటింగ్ పార్ట్ ఇప్పటికే ఎండ్ కి వచ్చేసింది. గ్రాఫిక్స్ వర్క్స్ ని వీలైనంత త్వరగా పూర్తి చేసి 2021 డిసెంబర్ లో సినిమాను విడుదల చేయాలనీ ప్లాన్ చేసుకుంటున్నారు. ఇక మిగతా రెండు పార్ట్ లకు సంబందించిన షూటింగ్ ని కూడా ఒకేసారి పూర్తి చేయనున్నారు. 2024 అనంతరం అవతార్ 1 అండ్ 2 సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.