Asianet News TeluguAsianet News Telugu

టాలీవుడ్ లో రికార్డ్స్ బ్రేక్ చేసిన అవతార్ ‌2, వంద కోట్ల క్లబ్ లోకి హాలీవుడ్ మూవీ

ఇండియాలో రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది అవతార్2 సినిమా. అనుకున్నట్టుగానే హాలీవుడ్ మూవీ లవర్స్ కు బిగ్ ట్రీట్ ఇచ్చింది. ఇండియాలో డబ్బింగ్ సినిమాల చరిత్రను తిరగరాసింది. 
 

Avatar 2 Movie 100 crore Collections in telugu States
Author
First Published Jan 10, 2023, 6:16 PM IST

దాదాపు 400 మిలియన్ డాలర్ల భారీ బడ్జెట్ తో.. సినిమా అంటే పిచ్చి ప్రేమ ఉన్న వరల్డ్ మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్ జేమ్స్ కామరూన్ కెమెరా నుంచి సృష్టించబడ్డ.  విజువల్ వండర్ అవతార్ 2. ఈ వెండితెర అద్భుతం ప్రపం వ్యాప్తంగా  ఆడియన్స్ ను ఫిదా చేస్తుంది అనే చెప్పాలి. ఫస్ట్ డే కొంత ఈ సినిమాపై పెదవి విరిచారు ఆడియన్స్.. కొంత మిక్స్డ్ టాక్ తో స్టార్ట్ అయిన ఈమూవీ .. రాను రాను  జనం ఎగబడి చూడటం స్టార్ట్ చేశారు. ఇండియాలో ఇప్పటి వరకూ రిలీజ్ అయిన హాలీవుడ్ సినిమాలన్నింటికి బాప్ లా తయారయ్యింది ఈ సినిమా. 

అవతార్2 సినిమా రిలీజ్ అయిన తరువాత.. ఇండియాన్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి కొత్త సినిమాలు చాలా రిలీజ్ అయ్యాయి. కాని ఏసినిమా రిలీజ్ అయినా సరే.. అవతార్ దూకుడు మాత్రం తగ్గలేదు. ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేసేసింది అవతార్ సీక్వెల్ మూవీ. 4 th  వీకెండ్ ను కూడా ఈ మూవీ సూపర్ గా క్యాష్ చేసుకుని తెలుగు రాష్ట్రాల్లో 100 కోట్ల మార్క్ ను చేరుకుంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో 24 డేస్ కలెక్షన్స్ ను చూసుకున్నట్టయితే. 

అవతార్ 2 ..అవతార్ ది వే ఆఫ్ వాటర్ రిలీజ్ అయిన ఈ మూవీకి రిలీజ్ కు ముందు  తెలుగు రాష్ట్రాల్లో కేవలం 5 కోట్ల థియేట్రికల్ బిజినెస్ మాత్రమే జరిగింది. చాలా ఏరియాల్లో రెంటల్ బేసిస్ మీద ఓన్ రిలీజ్ చేసుకున్నారు. దీంతో  చాలా తక్కువగా అంటే 5 కోట్ల 25లక్షల టార్గెట్ తో బరిలోకి దిగిన అవతారు2 ఫస్ట్ డేనే బ్రేక్  ఈవెన్ సాధించింది. సంగతి తెలిసిందే. ఇక 24 రోజులు పూర్తయ్యేసరికి  100 కోట్ల గ్రాస్ ను దాదాపు 60.10 కోట్ల భారీ షేర్ ని సోంతం చేసుకుంది హాలీవుడ్ మూవీ. 

ఇక 2009లో వచ్చిన అవతార్ సినిమా అప్పట్లో ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యిందో అందరికి తెలిసిందే. ఆసినిమాకు మరో నాలుగు సీక్వెల్స్ ను ప్రకటిచాడు జేమ్స్ కామరూన్. ఈక్రమంలోనే  13 ఏళ్ల  క్రితం రిలీజ్ అయిన అవతార్ కు ఫస్ట్ రీమేక్ మూవీగా అవతార్.. ద వే ఆఫ్ వాటర్ పేరుతో  సినిమాను రిలీజ్ చేశాడు. ఈ సినిమాపై ముందు నుంచే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. లేట్ అవుతున్న కొద్ది.. సినిమాపై ఆడియన్స్ లో ఇంట్రెస్ట్ పెరిగిపోయింది. తన టాలెంట్ తో నీటిలో అద్భుత ప్రపంచాన్ని సృష్టించాడు జేమ్స్ కామరూన్. డిసెంబర్ 16న ఈసినిమా రిలీజ్ అయ్యింది. ఇక మిగతామూడు సినిమాలపై అప్ డేట్ కోసం వెయిట్ చేస్తున్నారు కామరూన్ అభిమానులు. 


 

Follow Us:
Download App:
  • android
  • ios