`వివాహ బంధం కష్టమైనది. విడాకులు తీసుకోవడం కూడా కష్టమైనదే. ఏది కావాలో ఎంచుకోండి. బద్దకంగా ఉండటం కష్టం. ఫిట్‌గా ఉండటం కూడా కష్టమే, ఎలా ఉండాలో ఎంచుకోంది. అప్పుల్లో ఉండటం కష్టం. ఆర్థికంగా ఉన్నతంగా ఉండటం కూడా కష్టమే, ఎలా ఉండాలో నిర్ణయించుకోంది. కమ్యూనికేషన్‌ చేయం కష్టం. కమ్యూనికేషన్‌ చేయకపోవడం కూడా కష్టమే. ఏది కావాలో తెలుసుకోండి. జీవితం ఎప్పటికీ సులభంకాదు, కఠినంగానే ఉంటుంది. కానీ మనకు కావాల్సింది ఎంచుకోవచ్చు. తెలివిగా ఆలోచించండి` అని అంటోంది బాలీవుడ్‌ నటుడు ఇమ్రాన్‌ ఖాన్‌ అత్తగారు వందన మాలిక్‌. ఆమె ఇంతటి సందేశం ఇవ్వడానికి కారణమేంటనేది ఓ సారి చూస్తే. 

బాలీవుడ్‌ హీరో ఇమ్రాన్‌ ఖాన్‌కి, అవంతిక మాలిక్‌తో 2011లో వివాహం జరిగింది. వీరికి ఆరేళ్ల పాప కూడా ఉంది. అయితే గత ఏడాది కాలంగా ఇమ్రాన్‌, అవంతిక విడిపోయినట్టు వార్తలు వచ్చాయి. ఏడాది కాలంగా అవంతిక తమ తల్లిదండ్రుల వద్దే ఉంటోంది. ఇటీవల వారి కుమార్తె బర్త్ డే కూడా ఇమ్రాన్‌ లేకుండానే జరిపారు. దీంతో వీరిద్దరి మధ్య దూరం పెరిగిందని, ఆల్మోస్ట్ విడపోయారనే వార్తకి మరింత బలం చేకూరింది. 

ఈ వార్తలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో దీనిపై అవంతిక తల్లి వందన మాలిక్‌ స్పందించారు. ఈ వార్తలను ఖండించారు. విడిపోతున్నట్టు వస్తోన్న వార్తల్లో నిజం లేదన్నారు. వారిద్దరి మధ్య విభేధాలున్న మాట వాస్తవమే అని, అవి త్వరలోనే సెట్ అవుతాయని పేర్కొన్నారు. ఈ మేరకు ఆమె ఓ పోస్ట్‌ పెట్టారు. ఇన్‌ స్టాగ్రామ్‌ ద్వారా పై విధంగా పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా  డెవాన్‌ బ్రో రచయిత కవిత్వాన్ని రీపోస్టు చేస్తూ `ట్రూత్‌ బాంబ్‌` అని పేర్కొన్నారు. 

2008లో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఇమ్రాన్‌ కెరీర్‌ అంత ఆశాజనకంగా లేదు. 12ఏళ్ల కెరీర్‌లో 12 సినిమాల్లోనే నటించారు. 2015 నుంచి ఇప్పటి వరకు ఆయనకు సినిమాలు లేకపోవడం గమనార్హం.