బిగ్ బాస్ ఎలిమినేషన్ పై నీలి నీడలు కమ్ముతున్నాయి. ఈ విషయంలో పారదర్శకత లేదన్న మాట గట్టిగా వినిపిస్తుంది. పేరుకు ప్రేక్షకుల ఓట్లు అడుగుతూ...ఎలిమినేషన్ మాత్రం ఇష్టం వచ్చిన వారిని చేస్తున్నారని నెటిజెన్స్ అంటున్నారు. ఇదే విషయంపై సోషల్ మీడియా వేదికగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. బిగ్ బాస్ నిర్వాహకులతో పాటు హోస్ట్ నాగార్జునపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఈ వారం హౌస్ నుండి నటుడు కుమార్ సాయి ఎలిమినేట్ కావడం జరిగింది. 

ఈ ఎలిమినేషన్ ప్రక్రియలో తక్కువ ఓట్లు సంపాదించిన కంటెస్టెంట్స్ గా మోనాల్, కుమార్ సాయి ఉన్నారు. ఇద్దరిని లగేజ్ సర్దుకొని కన్ఫెషన్ రూమ్ కి రమ్మన్న నాగార్జున మోనాల్ ని సేవ్ చేసి...సాయి ఎలిమినేటైనట్లు ప్రకటించి వేదికపైకి రమ్మన్నారు. నెటిజెన్స్ అభిప్రాయం ప్రకారం మోనాల్ ఎలిమినేట్ కావలసి ఉండగా కావాలనే కుమార్ సాయిని బలిచేశారు అంటున్నారు. వల్గారిటీ ఎక్కువై పోయిందన్న అపవాదు మూటగట్టుకున్న మోనాల్ పై ప్రేక్షకులలో నెగెటివిటీ ఎక్కువైంది. ఈ నేపథ్యంలో మోనాల్ కంటే కుమార్ సాయి కి తక్కువ ఓట్లు రావడం జరగని పని అంటున్నారు. 

గతంలో ఎలిమినేట్ అయిన దేవి నాగవల్లి, స్వాతి దీక్షిత్ విషయంలో కూడా ఏదో మతలబు జరిగిందని నెటిజెన్స్ ఆరోపణ. మనం వేసిన ఓట్లకు ప్రాధానత్య లేనప్పుడు షో చూడడం దేనికి, ఓట్లు వేయడం ఎందుకని బిగ్ బాస్ వీక్షకులు వాపోతున్నారు. ఇకనైనా బిగ్ బాస్ నిర్వాహకులు ఏమైనా లోపాలు ఉంటే సరిచేసుకొని..షో పారదర్శకంగా నడపడపక పోతే షో టీఆర్పీ పడిపోవడం ఖాయం. ఇక నిన్న జరిగిన నామినేషన్స్ ప్రక్రియలో దివి, అవినాష్, మోనాల్, ఆరియానా, అభిజిత్ మరియు నోయల్ ఎలిమినేషన్ కి ఎంపికయ్యారు. ఈ ఆరుగురు సభ్యులలో ఒకరు వచ్చే వారం హౌస్ నుండి బయటికి రానున్నారు.