పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు అందుకున్న చిత్రాల్లో అత్తారింటికి దారేది ఒకటి. త్రివిక్రమ్ దర్శకత్వంలో 2013లో వచ్చిన ఆ సినిమా ఒక ట్రెండ్ సెట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు అలాంటి ఒక హిట్ కోసమే ప్రయత్నం చేస్తున్నాడు కోలీవుడ్ హీరో శింబు. ఆ సినిమాను తమిళ్ లో ఈ హీరో రీమేక్ చేస్తోన్న సంగతి తెలిసిందే. 

సుందర్ సి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఆ సినిమాలో మేఘ ఆకాష్ - క్యాథెరిన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు చిత్ర యూనిట్ టైటిల్ ను ఫిక్స్ చేసింది. దీపావళి సందర్బంగా గా "వంద రాజావాతాన్ వరువేన్" అనే టైటిల్ తో శింబు ఉన్న పోస్టర్ ని కూడా రిలీజ్ చేశారు. 

తమిళ నేటివిటీకి తగ్గటుగా సినిమాలో ఎమోషన్ కి సంబందించిన సన్నివేశాలను మార్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ లెక్కలను తిరగరాసిన ఈ అత్త కథ శింబుకి ఎంతవరకు హిట్ ఇస్తుందో చూడాలి.