నటి షకీలా పై దాడి... పోలీసులకు ఫిర్యాదు!
నటి షకీలా పై కూతురు దాడి చేసింది. ఈ మేరకు ఆమె పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఈ దాడికి కారణాలు ఏమిటో చూద్దాం..
నటి షకీలా వివాహం చేసుకోలేదు. అయితే ఆమె ఓ అమ్మాయిని పెంచుకుంటుంది. ఆ అమ్మాయి పేరు శీతల్. షకీలాతో శీతల్ కి కుటుంబ వ్యవహారాల విషయంలో మనస్పర్థలు తలెత్తాయి. శీతల్ ఇంటి నుండి వెళ్ళిపోయింది. మాట్లాడేందుకు పిలిపించగా తల్లితో పాటు శీతల్ షకీలా వద్దకు వచ్చిందట. శీతల్ కి షకీలా సర్ది చెప్పేందుకు ప్రయత్నిస్తుంటే... తనపై దాడి చేసిందట. దాంతో షకీలా పోలీసులకు ఫిర్యాదు చేసిందట.
కాగా శీతల్ సైతం షకీలా మీద కేసు పెట్టిందట. ఇద్దరి ఫిర్యాదులు తీసుకున్న పోలీసులు సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా విచారణ చేపట్టారని సమాచారం. 90లలో షకీలా శృంగార తారగా వెలిగిపోయింది. మలయాళంలో ఆమె వందల చిత్రాల్లో నటించింది. కొందరిని నమ్మి సంపాదించిందంతా ఆమె కోల్పోయారు. కొన్నాళ్ళు కమెడియన్ గా నటించారు. ఇటీవల ఆమె పెద్దగా సిల్వర్ స్క్రీన్ పై కనిపించడం లేదు.
షకీలా బిగ్ బాస్ తెలుగు 7లో పాల్గొనడం విశేషం. అయితే ఆమె పెద్దగా రాణించలేదు. రెండో వారమే ఎలిమినేట్ అయ్యింది. వయసురీత్యా ఆమె హౌస్లో యాక్టివ్ గా లేదు. ఒకప్పటి టాలీవుడ్ టాప్ డైరెక్టర్ తనను కమిట్మెంట్ అడిగాడని ఇటీవల షకీలా ఆరోపణలు చేయడం కొసమెరుపు.