అల్లు అర్జున్ తో సినిమాపై అట్లీ రియాక్షన్
సోషల్ మీడియా అంతటా డైరెక్టర్ అట్లీ పేరు కనిపిస్తోంది.ఈ డైరెక్టర్ తన తర్వాతీ ప్రాజెక్ట్ను నేషనల్ స్టార్ హీరో అల్లు అర్జున్(Allu Arjun) తో చేయబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది.

గత కొద్ది రోజులుగా తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ, అల్లు అర్జున్ కాంబినేషన్ లో ఓ సినిమా ఉంటుందని ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా అది దాదాపుగా కన్ఫామ్ అయ్యినట్లు తేలింది. అయితే ఎప్పుడు ఏమిటి..కేవలం ఇవన్నీ మీడియా వార్తలేనా..అట్లీ ఏమంటున్నాడు అనే వివరాళ్లోకి వెళితే..
దర్శకుడు అట్లీ రీసెంట్గా బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్తో జవాన్ చిత్రం తీసి భారీ బ్లాక్ బస్టర్ హిట్ను తన ఖాతాలో వేసుకున్నారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ కుంభవృష్టి కురిపిస్తూ దూసుకెళ్తోంది. అదే సమయంలో అట్లీ .. తన తర్వాతి సినిమాను అల్లు అర్జున్తో కలిసి చేస్తారన్న టాక్ కూడా మొదలైంది. అయితే అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే ఇంకా రాలేదు. ఈలోగా అల్లు అర్జున్ ట్విట్టర్ లో జవాన్ సక్సెస్ కు కంగ్రాట్స్ చెప్తూ రియాక్ట్ అయిన తర్వాత ఈ టాపిక్ నిజమే అని క్లారిటీ వచ్చింది.
అల్లు అర్జున్ 'జవాన్' టీమ్ పై ప్రశంసలు కురిపిస్తూ ఓ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ ట్వీట్ కు అనిరుధ్ స్పందించారు. 'థాంక్యూ మై బ్రో' అని రిప్లై ఇవ్వగా... సింపుల్ గా థాంక్స్ చెప్పడం కాదు... నాక్కూడా మంచి పాటలు ఇవ్వాలన్నారు. దీంతో అల్లు అర్జున్ మూవీకి అనిరుధ్ ఫిక్స్ అయినట్లు అర్థం అవుతోంది.
అందరూ అట్లీ ఏమంటాడో అని చూస్తున్నారు. ఎట్టకేలకు అల్లు అర్జున్ తో సినిమాపై స్పందించాడు అట్లీ. తామిద్దరి మధ్య ఓ ఐడియా పై చర్చ జరిగిన విషయం నిజమేనని అంగీకరించాడు. అయితే ఎప్పుడు చేద్దాం, ఎలా ముందుకు వెళ్దాం అనే అంశాలపై ఇంకా నిర్ణయానికి రాలేదని ప్రకటించాడు. అయితే అల్లు అర్జున్ తో సినిమా చేయాలనే ఇంటెన్షన్ ను మాత్రం బయటపెట్టాడు అట్లీ.
ప్రస్తుతం జవాన్ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నా అన్నాడు అట్లీ. ఇప్పటికిప్పుడు మరో ప్రాజెక్ట్ ను తను పట్టాలపైకి తీసుకురాలేనని స్పష్టం చేశాడు. కొన్నాళ్ల పాటు తన కొడుకుతో గడిపి, ఆ తర్వాత కొత్త కథపై రచన ప్రారంభిస్తానని తెలిపాడు. జవాన్ సీక్వెల్ మాత్రం ఖచ్చితంగా ఉంటుందని అన్నాడు. నా నెక్ట్స్ ఫిల్మ్ గ్లోబుల్ ఆడియన్స్ ని ఆకట్టుకోవాలనే టార్గెట్ తో చేస్తున్నట్లు తెలియచేసాడు.