తమిళ సూపర్‌హిట్ చిత్రం‘జిగర్తాండ’.. తెలుగులో ‘వాల్మీకి’గా రీమేక్ కాబోతున్న సంగతి తెలిసిందే. తమిళ్‌లో బాబీ సింహా, సిద్దార్థ్‌లు ముఖ్య పాత్రలు పోషించగా.. ఈ రీమేక్‌లో బాబీ సింహా పాత్రను వరుణ్‌ తేజ్‌ పోషిస్తున్న సంగతి తెలిసిందే.  రీసెంట్ గా  పూజా కార్యక్రమాలను ప్రారంభించిన చిత్రయూనిట్‌ మిగతా నటీనటులను ఎంపిక చేసే పనుల్లో ఉన్నారు. 

వరుణ్‌ తేజ్‌ చేస్తున్న నెగెటివ్‌ పాత్ర చుట్టూ తిరిగే ఈ కథలో మరో ప్రముఖ పాత్ర కూడా ఉండగా.. ఈ పాత్రకు శ్రీవిష్ణును పరిశీలిస్తున్నట్లు  వార్తలు వచ్చాయి. కథా పరంగా శ్రీవిష్ణు ఈ పాత్రకు సరిగ్గా సరిపోతాడని అందరూ భావించారు.  అయితే ఎవరూ ఊహించని విదంగా సీన్ లోకి తమిళ హీరో అధర్వ వచ్చారు. శ్రీ విష్ణు డేట్స్ దొరక్క అధర్వని తెచ్చారని చెప్పుకుంటున్నా అసలు కారణం వేరే ఉందంటున్నారు.

వరుణ్ తేజ కాకుండా ఈ సినిమాలో తెలుగు హీరో వేరే వాళ్లు ఉంటే కనుక ....కథ ప్రకారం వరుణ్ తేజ్ చేసేది నెగిటివ్ రోల్ కాబట్టి ...ఖచ్చితంగా వేరే వాళ్లను హీరో అనుకుంటారు. అదే వరుణ్ తేజ్ ని హీరో అనుకోవాలంటే మనకు పెద్దగా తెలియని వ్యక్తిని మరో క్యారక్టర్ గా ప్రొజెక్ట్ చేయాలని దర్శకుడు హరీష్ శంకర్ భావించారట.

అలా అధర్వ సీన్లోకి వచ్చారు. ప్రస్తుతానికి అధికారిక ప్రకటన రాకపోయినా అధర్వ ఈ వాల్మీకి తో తెలుగులో  ఎంట్రీ ఇవ్వటం ఖాయంగా కనిపిస్తోంది. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్‌ సంగీతమందిస్తున్నాడు.